పెను సవాలుగా బాలికల సంరక్షణ

ABN , First Publish Date - 2023-01-25T00:58:25+05:30 IST

నేటి సమాజంలో బాలికల సంరక్ష ణ పెను సవాలుగా మారిందని ప్రథమ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతిదేవి అన్నారు. మంగళవారం జాతీయ బాలికా దినోత్సవంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖల ఆధ్వర్యంలో పాతగుట్ట గణే్‌షనగర్‌ నుంచి సింహద్వారం పట్ట ణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

పెను సవాలుగా బాలికల సంరక్షణ
గుట్టలో మానవహారం నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సిబ్బంది

ప్రథమ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతిదేవి

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 24: నేటి సమాజంలో బాలికల సంరక్ష ణ పెను సవాలుగా మారిందని ప్రథమ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతిదేవి అన్నారు. మంగళవారం జాతీయ బాలికా దినోత్సవంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖల ఆధ్వర్యంలో పాతగుట్ట గణే్‌షనగర్‌ నుంచి సింహద్వారం పట్ట ణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతిదేవి, ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.దశరథరామయ్య, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ నాగరికత, సాంకేతికత, విద్య, విజ్ఞానం పెరుగుతున్నప్పటికీ మనిషి తనను తాను మరిచి మానవతా విలువలకు దూరమవుతున్నాడన్నారు. బాలికలపై అకృత్యాలకు పాల్పడితే చట్టం ఊరుకోదన్నారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ సమితి అధ్యక్షురాలు బి.జయశ్రీ, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.కేశవరెడ్డి, ఆలేరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూదగాని శ్రీహరిగౌడ్‌, గుట్ట మునిసిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ శివశంకర్‌గౌడ్‌, సీఐ సైదయ్య, సైదులు, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:58:26+05:30 IST