భూదాన్‌పోచంపల్లిలో ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు

ABN , First Publish Date - 2023-01-26T01:03:24+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన యూఆర్‌ఎక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీకి చెందిన 25మంది విద్యార్థులు బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు.

భూదాన్‌పోచంపల్లిలో ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు
పోచంపల్లిలో చేనేత మగ్గాల పనితీరును పరిశీలిస్తున్న ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు

భూదాన్‌పోచంపల్లి, జనవరి 25: హైదరాబాద్‌కు చెందిన యూఆర్‌ఎక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీకి చెందిన 25మంది విద్యార్థులు బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్‌ టూరిజం సెంటర్‌లో లీవ్‌టుక్లాత్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. చేనేత కార్మికుల మగ్గాలు సందర్శించి కార్మికుల పనివిధానం, చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలను వారు పరిశీలించారు. చేనేత కళాకారుల రూపొందించిన డిజైన్లను చూసి వారి కళాత్మక ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత టైఅండ్‌డై డిజైన్లను తమ సెల్‌ఫోన్‌లో విద్యార్థులు బంధించారు. కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అరవింద్‌ సోనీ, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:03:24+05:30 IST