కేజీబీవీలో కనీస వేతనం అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-01-26T01:08:54+05:30 IST

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో బోధనేతర సిబ్బందికి కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ జనార్దన్‌ డిమాండ్‌చేశారు.

కేజీబీవీలో కనీస వేతనం అమలు చేయాలి

ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ జనార్దన్‌

భువనగిరి అర్బన్‌, జనవరి 25: కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో బోధనేతర సిబ్బందికి కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ జనార్దన్‌ డిమాండ్‌చేశారు. బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌ పమేలాసత్పథికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో కేజీబీవీలను ప్రారంభించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయుల ఉద్యోగం పర్మినెంట్‌ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, స్కీం వర్కర్ల సంక్షేమంకోసం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం అసోసియేషన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ రఫియా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు విజయ, నాయకురాళ్లు కె పద్మ, కె పార్వతమ్మ, ఎండీ ఫరీదా, భారతమ్మ, బీ స్వరూప, సీహెచ్‌ ఉమ, డి మమత, బీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:08:54+05:30 IST