మెస్ చార్జీలు పెంచాలి
ABN , First Publish Date - 2023-01-25T00:52:00+05:30 IST
పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ, జనవరి 24: పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం మంజూరు చేసే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువులు కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 13లక్షల మంది విద్యార్థుల ఫీజులు పెండింగ్‌లో ఉండడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. వసతిగృహల్లో వుండి విద్యానభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం రూ.1500 మాత్రమే ఇస్తోందని, దానిని రూ.4వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు పదివేల ర్యాంకు నిబందనను ఎత్తివేసి ప్రతి బీసీ విద్యార్థికీ ప్రభుత్వమే పూర్తిగా ఫీజు చెల్లిం చాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పగిడి జీడయ్య, పోలగాని వెంకటేశ్, పొలిశెట్టి అజయ్, అనిల్, పల్లా వెంకన్న, రాంబాబు పాల్గొన్నారు.
హాలియా: హాలియా పట్టణంలో బీసీ బాల, బాలికల కళాశాల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని బీసీ యువజన సంఘం నాయకుడు రేపాకుల ఆంజనేయులుయాదవ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. హాలియా పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విధ్యాభ్యాసం చేస్తున్నారని, వసతి లేకపోవడంతో బస్సుల్లో కళాశాలకు వస్తున్నారని దీంతో ప్రమాదాల బారీన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకట్, నియోజక వర్గ అధ్యక్ష, కార్యదర్శులు మోర మధుయాదవ్, నకినబోయిన సతీష్, జోగు రమేష్, అన్నెబోయిన కొండల్, నల్లగంతుల యాదగిరి, పామనగుండ్ల లాలయ్యగౌడ్, అనిల్‌గౌడ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.