పాత కక్షలు, భూ తగాదాలతోనే హత్య

ABN , First Publish Date - 2023-01-25T00:45:45+05:30 IST

పాత కక్షలు, కుటుంబ, భూ తగాదాలతో జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు.

పాత కక్షలు, భూ తగాదాలతోనే హత్య

నకిరేకల్‌, జనవరి 24: పాత కక్షలు, కుటుంబ, భూ తగాదాలతో జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరులకు సీఐ వెంకటయ్య వివరాలు వెల్లడించారు. నకిరేకల్‌ మండలం తాటికల్‌ గ్రామానికి చెందిన ఆకటి వెంకట య్యకు అదే గ్రామానికి చెందిన వనం సైదులు బావ మరిది. వారి మధ్య కొంతకాలంగా భూ పంచాయితీ, కుటుంబ తగాదాలు ఉన్నా యి. 2013లో వెంకటయ్య కొడుకు ఆకటి సైదులుపై వనం సైదులు, ఆయన కుమారులు నాగరాజు, గోపి కలిసి కల్లుగీసే కత్తితో గాయ పరచగా అప్పట్లో ముగ్గురిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఒక రిపై ఒకరు కక్ష పెంచుకున్నారు. భూమి పంచాయితీని మనసులో పెట్టుకుని ఈనెల 20న ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో ఆకటి వెంకటయ్య గ్రామ శివారులోని ముత్యాలమ్మ చెరువు వైపు కాలకృత్యాలకు వెళ్తుండగా అప్పటికే చెరువు వద్ద కాపు కాసిన వనం సైదులు, అతని కుమారులు నాగరాజు, గోపిలతో పాటు సైదులు, కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన నార్ల యాదయ్య కలిసి వెంకటయ్యతో గొడవపడ్డారు. బలవ ంతంగా మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళి ముత్యాలమ్మ చెరువు లో వెంకటయ్యను ముంచి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. వెంకట య్య కుమారుడు ఆకటి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వి చారణ చేయగా వనం సైదులు అతని కుమారులు హత్య చేసినట్లు తెలిపారు. నకిరేకల్‌ మండలం చందంపల్లి గ్రామబస్‌ స్టేజీ వద్ద మ ంగళవారం వనం సైదులు, నాగరాజు, గొపి, నార్ల యా దయ్య ఉండ టంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి, వారివద్ద ఉన్న సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన పెట్రోల్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-01-25T00:45:45+05:30 IST