చట్టాలపై బాలికలకు అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2023-01-25T02:19:56+05:30 IST

చట్టాలపై బాలికలకు అవగాహన ఉండాలని హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి జిట్టా శ్యాంకుమార్‌ కోరారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు.

చట్టాలపై బాలికలకు అవగాహన ఉండాలి
డీఎంహెచ్‌వో కోటా చలం

హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి జిట్టా శ్యాంకుమార్‌

జిల్లా వ్యాప్తంగా జాతీయ బాలికల దినోత్సవం

హుజూర్‌నగర్‌ , జనవరి 24: చట్టాలపై బాలికలకు అవగాహన ఉండాలని హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి జిట్టా శ్యాంకుమార్‌ కోరారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలికల సంక్షేమం ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చర్చలు, కౌన్సెలింగ్‌తో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు, మహిళా చట్టాల అమలుతో పాటు బాలికల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కేసులను సత్వరం పరిష్కరించే మెగా లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు కాలువ శ్రీనివాసు, గోపాలకృష్ణ, సుందర రాఘవరావు, సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ అనిత, పాల్గొన్నారు.

ఆడపిల్లలపై వివక్ష చూపోద్దు: డీఎంహెచ్‌వో

సూర్యాపేటరూరల్‌: సమాజంలో ఆడపిల్లలపై వివక్ష చూపోద్దని డీఎంహెచ్‌వో కోటా చలం అన్నారు. మహిళా శిశు, దివ్యాంగులు, వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సభ్యులు మండలంలోని ఇమాంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబంలో లింగవివక్ష లేకుండా చూడాలన్నారు. సమాజంలో ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆడపిల్లలకు చదువు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. ప్రతీఒక్కరు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నతస్థాయిలో రాణించాలని సూచిం చారు. బాల్య వివాహలపై అవగహన కల్పించారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్‌, జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ, రమణారావు, బిక్షం, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి సీడీపీవోలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

బాలికలు విద్యలో రాణించాలి: ఎంపీపీ

అర్వపల్లి: బాలికలు విద్యలో రాణించాలని ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్య యాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యా దవ్‌ అన్నారు. అర్వపల్లి లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్స వాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో బాలునాయక్‌, ప్రత్యేక అధికారి నాగరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేత

ఆత్మకూర్‌(ఎస్‌): మండల కేంద్రంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు కార్యక్రమంలో తహసీల్దార్‌ హేమమాలిని, ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్‌ భాగ్యలక్ష్మి, సరస్వతి, హెచ్‌ఎం నాగలక్ష్మి, రఘ, లలిత, సైదులు తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి రూరల్‌: మండలంలోని జలాల్‌పురం ఉన్నత పాఠశా లలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వ్యాసరచన, స్కిప్పింగ్‌ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్ర మంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ కైరున్నీసా, హెచ్‌ఎం అశోక్‌ పాల్గొన్నారు.

మేళ్లచెర్వు: మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ సూర్యకళ, కస్తూర్భా పాఠశాల హెచ్‌యం రత్నకుమారి పాల్గొన్నారు.

నూతనకల్‌: మండల కేంద్రంలో ఎంవీఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో నూతనకల్‌ సర్పంచ్‌ తీగల కరుణశ్రీ గిరిధర్‌ రెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమమల్లారెడ్డి రవి పాల్గొన్నారు.

ఆడ పిల్లలను గౌరవిద్దాం: ఎంపీపీ

మఠంపల్లి: ఆడ పిల్లలను గౌరవిద్దామని ఎంపీపీ ముడావత్‌ పార్వతి కొండానాయక్‌ అన్నారు. మండలంలోని కస్తూర్బా పాఠశాలలో నిర్వహిం చిన వేడుకలో ఆమె మాట్లా డారు. బాలికలు, మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్‌ నాయక్‌, ఎంపీడీవోజానకిరాములు, ఎంపీవో ఆంజనేయులు, ప్రిన్సిపాల్‌ విజయకుమారి, నాగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T02:19:56+05:30 IST