మృత్యువులోనూ వీడని స్నేహం

ABN , First Publish Date - 2023-02-07T01:28:28+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చివ్వెంల, ఫిబ్రవరి 6: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చివ్వెంల ఏఎస్‌ఐ జి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామానికి చెందిన అక్కినపల్లి దశరథ(38) సొంత పనుల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం రాత్రి సూర్యాపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని కాట మయ్య గుడి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ దశరథ బైక్‌ను అతి వేగంతో ఢీకొట్టి, పైనుంచి లారీ దూసుకువెళ్లింది. ఈప్రమాదంలో దశరథ అక్కడి క్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. కాల్వలో పడి.. గరిడేపల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్‌ 10వ నంబరు కాల్వలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం మైలవరానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌ (20) నాలుగు రోజుల క్రితం నేరేడుచర్ల మండల కేంద్రం లోని తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చాడు. సోమవారం బంధువులతో కలిసి ఎల్బీ నగర్‌ కాల్వ దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి కొట్టుకుపోతున్న ఇమ్రాన్‌ను బయటకు తీసి నేరేడు చర్లలోని ఆస్పత్రికి తరలించగా అప్ప

మృత్యువులోనూ వీడని స్నేహం

ఇద్దరి ప్రాణాలను తీసిన రోడ్డు ప్రమాదం

అక్కడికక్కడే ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి

నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో విషాదం

మునగాల, నడిగూడెం, ఫిబ్రవరి 6: వయసు రీత్యా వ్యత్యాసం ఉన్నా వారిద్దరూ చిన్ననాటి మిత్రులు. చదువులో అంతగా రాణించక పోయినావ్యవసాయంలో దిట్టగా నిలిచారు. అందరికీ అదర్శంగా నిలిచిన స్నేహితులు మృత్యువులోనూ తోడుగా వెళ్లారు. మునగాల పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలంలోని కాగితరామచంద్రపురం గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ఘని(44), ఖాజా షరీఫ్‌(37)స్నేహితులు. వ్యవసాయం చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. వ్యవసాయానికి ఎరువులు తెచ్చేందుకు వెళ్లి మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి ఆదివారం వెళ్లారు. ముకుందాపురం గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక సీట్లో కూర్చొని ఉన్న ఘని అక్కడికక్కడే మృతి చెందగా, షరీఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. షరీఫ్‌ను 108 అంబులె న్సులో స్థానికులు ఖమ్మంలోని తరతలించారు. అక్కడి నుంచి మెరు గైన చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాత్రి సమ యంలో మృతి చెందాడు. అబ్దుల్‌ ఘనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఉమైమ్మ బీటెక్‌ రెండో సంవ త్సరం, చిన్న కుమార్తె ఉజ్మ బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఖాజీ షరీఫ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు షాదిక్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

మృతదేహాలకు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి, జడ్పీటీసీ బానాల కవితనాగరాజు, సర్పంచ్‌ వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు దేవబత్తిని సురేష్‌ప్రసాద్‌, డి.వెంకటనర్సయ్య, ఎండీ కలీల్‌ అహ్మద్‌, అంతిరెడ్డి తదితరులు నివాళులర్పించారు.

గ్రామంలో గంటల వ్యవధిలో అంత్యక్రియలు

వీరిద్దరి అంత్యక్రియలు కాగితరామచంద్రాపురం గ్రామంలో సోమవారం గంటల వ్యవఽధిలో నిర్వహించారు. ఘని అంత్యక్రియ లను ఉదయం, ఖాజా షరీఫ్‌ అంత్యక్రియలను సాయంత్రం నిర్వ హించారు. ఇద్దరినీ పక్కపక్కనే ఖననం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యజమానులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ రెండు కుటుంబాలకు తీరని విషాదం మిగిలింది.

టికే మృతి చెందాడు.రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

చివ్వెంల, ఫిబ్రవరి 6: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చివ్వెంల ఏఎస్‌ఐ జి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామానికి చెందిన అక్కినపల్లి దశరథ(38) సొంత పనుల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం రాత్రి సూర్యాపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని కాట మయ్య గుడి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ దశరథ బైక్‌ను అతి వేగంతో ఢీకొట్టి, పైనుంచి లారీ దూసుకువెళ్లింది. ఈప్రమాదంలో దశరథ అక్కడి క్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

కాల్వలో పడి..

గరిడేపల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్‌ 10వ నంబరు కాల్వలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం మైలవరానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌ (20) నాలుగు రోజుల క్రితం నేరేడుచర్ల మండల కేంద్రం లోని తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చాడు. సోమవారం బంధువులతో కలిసి ఎల్బీ నగర్‌ కాల్వ దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి కొట్టుకుపోతున్న ఇమ్రాన్‌ను బయటకు తీసి నేరేడు చర్లలోని ఆస్పత్రికి తరలించగా అప్ప

Updated Date - 2023-02-07T01:29:09+05:30 IST