రోగులపై నిర్లక్ష్యం చూపొద్దు

ABN , First Publish Date - 2023-01-25T00:56:18+05:30 IST

వైద్య సేవలకోసం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం చూ పొద్దని, స్వల్ప కారణాలు చూపుతూ ప్రైవేట్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేయడం మానుకోవాలని భువనగిరి జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ.. వైద్యులకు సూచించింది.

రోగులపై నిర్లక్ష్యం చూపొద్దు
ఆస్పత్రి వివరాలను కమిటీకి వివరిస్తున్న సూపరిటెండెంట్‌ డాక్టర్‌ చిన్నా నాయక్‌

స్వల్ప కారణాలతో ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేయవద్దు

నెలాఖరువరకు డయాలసిస్‌ సేవలు ప్రారంభించాలి

భువనగిరి టౌన్‌, జనవరి 24: వైద్య సేవలకోసం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం చూ పొద్దని, స్వల్ప కారణాలు చూపుతూ ప్రైవేట్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేయడం మానుకోవాలని భువనగిరి జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ.. వైద్యులకు సూచించింది. అభివృద్ధి కమిటీ చైర్మన్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మేల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి, డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌రావు, సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ తదితర సభ్యులు మాట్లాడుతూ ఆసుపత్రిలో నెలకొన్న మెడికల్‌, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గతంతో పోలిస్తే శస్త్రచికిత్సలు తగ్గి సుఖ ప్రసవాలు పెరగడం హర్షనీయమన్నారు. డయాలసిస్‌ సెంటర్‌ను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని నిర్వహణ ఏజెన్సీని ఆదేశించారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఆస్పత్రికి 25ఫ్యాన్ల కొనుగోలుకు, మార్చురీకి రెండు ఫ్రీజర్ల కొనుగోలుకు తీర్మానించారు. రోగులకు అందించే భోజన నాణ్యతా ప్రమాణాలను ఆర్‌ఎంవో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆస్పత్రిలో మరిన్ని వైద్యసేవలకు, ఖాళీల భర్తీకి వైద్యఆరోగ్య శాఖా మంత్రి హరీ్‌షరావుకు లేఖ రాయాలని నిర్ణయించారు. అంతుకుమందు ఆస్పత్రిలోని వార్డులన్నింటిని పరిశీలించి రోగులతో మాట్లాడారు. సమావేశంలో కమిటీ సభ్యులు భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, జడ్పీటీసి సుబ్బూరు బీరు మల్లయ్య, బొమ్మలరామారం, తుర్కపల్లి ఎంపీపీలు చిముల్ల సుధీర్‌రెడ్డి, భూక్య సుశీల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:56:19+05:30 IST