ట్రాన్స్‌కోకు కాసుల పంట

ABN , First Publish Date - 2023-01-25T00:53:35+05:30 IST

గృహ, వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగదారులనుంచి అదనపు వినియోగ డిపాజిట్‌ (ఏసీడీ-అడిషనల్‌ కంజంప్షన్‌ డిపాజిట్‌) వసూళ్లతో రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎ్‌సఎస్పీడీసీఎల్‌)కు భారీ ఆదా యం లభిస్తోంది. దీంతో ఏసీడీ పరిధిలోకి వస్తున్న విద్యుత్‌ వినియోగదారులపై కోట్లాది రూపాయల భారం పడుతుండగా గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఏసీడీ పరిధిలో లేకపోవడం ఉపశమనం కల్గిస్తున్న అంశం.

ట్రాన్స్‌కోకు కాసుల పంట

విద్యుత్‌ పంపిణీ సంస్థకు కలిసొచ్చిన ఏసీడీ

గృహ, వ్యవసాయేతర కనక్షన్లకే వర్తింపు

భువనగిరి టౌన్‌, జనవరి 24: గృహ, వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగదారులనుంచి అదనపు వినియోగ డిపాజిట్‌ (ఏసీడీ-అడిషనల్‌ కంజంప్షన్‌ డిపాజిట్‌) వసూళ్లతో రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎ్‌సఎస్పీడీసీఎల్‌)కు భారీ ఆదా యం లభిస్తోంది. దీంతో ఏసీడీ పరిధిలోకి వస్తున్న విద్యుత్‌ వినియోగదారులపై కోట్లాది రూపాయల భారం పడుతుండగా గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఏసీడీ పరిధిలో లేకపోవడం ఉపశమనం కల్గిస్తున్న అంశం. ఈ మేరకు జిల్లాలో 4,603 విద్యుత్‌ సర్వీసులనుంచి రూ.22,58,12,000 ఏసీడీ డిమాండ్‌ ఉండ గా నేటివరకు రూ.19,53,26,000 వసూలయ్యాయి. ఇంకా రూ.3,04,86,000 మాత్రమే వసూలు కావాల్సి ఉంది.

ఏడాదికి ఒకసారి వినియోగం లెక్కింపు

విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) రెగ్యులేషన్‌ నెం.6-2004 ప్రకారం విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రతీ సంవత్సరానికి ఒకసారి వినియోగదారుల అదనపు విద్యుత్‌ వినియోగాన్ని లెక్కిస్తుంది. గత సంవత్సరంలో వాడుకున్న యూనిట్ల సరాసరి నెలకు లెక్కించి ఆమేరకు రెండు నెలల విద్యుత్‌ బిల్లులను ఏసీడీ రూపంలో విధించి వసూలు చేస్తోంది. ప్రతీ సంవత్సరం జనవరి నెల బిల్లులో ఏసీడీని కలుపుతారు. అయితే మరుసటి సంవత్సర లెక్కింపులో వినియోగం తగ్గితే వసూలు చేసిన ఏసీడీని ఆ సం వత్సరం జనవరి వరుస నెలల విద్యుత్‌ బిల్లులలో మినహాయిస్తారు. అంతేగాక ఏసీడీగా వసూలు చేసి న మొత్తానికి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వడ్డీని కూడ విద్యుత్‌ పంపిణీ సంస్థ చెల్లిస్తుంది. అయితే విద్యుత్‌ కనెక్షన్‌ పొందే సమయంలో వినియోగరారుడు పేర్కొనే కిలోవాట్స్‌కు మించి విద్యుత్‌ను వినియోగిస్తుండటంతోనే ఏసీడీ చెల్లించాల్సి వస్తోంది.

జిల్లాలో రూ.22.58 కోట్ల ఏసీడీ డిమాండ్‌

జిల్లాలో గృహ, వ్యవసాయేతర 4,603 పరిశ్రమలు వాణి జ్యం,కమర్షియల్‌ ప్రైవేట్‌ కనెక్షన్లు, వీధి దీపాలు, నీటి సరఫరా తదితర ప్రభుత్వ సర్వీసులనుంచి 22,58,12,000 డిమాండ్‌ ఉండగా నేటి వరకు 19,53,26,000 వసూలు కాగా కేవలం రూ.3,04,86,000 రావాల్సి ఉంది. ఈ మొత్తంలో హెచ్‌టీ కేటగిరీలోని 184 ప్రైవేట్‌, ప్రభుత్వ సర్వీసుల నుంచి రూ.17,88,63,000 డిమాండ్‌కు రూ.17,78,00,000 వసూలు కాగా ఇంకా రూ.9.64లక్షలు మాత్రమే వసూలు కావాల్సి ఉంది. అలాగే ఎల్‌టీ కేటగిరీలోని చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలు 4,419 తదితర సర్వీసులనుంచి రూ.4,69,49,000 డిమాండ్‌కుగాను రూ.1,75,26,000 ఏసీడీని వినియోగదారులు చెల్లించగా మిగతా రూ.2,94,24,0 92 వసూలుకు ట్రాన్స్‌కో సిబ్బంది శ్రమిస్తున్నారు.

విద్యుత్‌ వినియోగం ఆధారంగానే ఏసీడీ : బాలచంద్రుడు, ఎస్‌ఏవో, యాదాద్రి సర్కిల్‌.

విద్యుత్‌ వినియోగం ఆధారంగానే ఏసీడీ సేకరిస్తాం. ఈప్రక్రియలో వినియోగదారులపై ఎలాంటి అదనపు బిల్లుల భారం పడదు. పైగా ఆతర హా సర్వీసులన్నీ వినియోగించిన విద్యుత్‌ మేరకు బిల్లులు చెల్లిస్తున్నట్లు పరిగణించబడతాయి. ఏసీడీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని మరుసటి సంవత్సరానికి వినియోగించుకునే తీరుపై వినియోగదారుడికే అవకాశం ఉంటుంది. ఏసీడీ బకాయిదారులంతా వెంటనే చెల్లించాలి. ఇందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఏసీడీకి ట్రాన్స్‌కో పూర్తి బాధ్యత వహిస్తుంది. ఏసీడీపై ప్రజలు అపోహలు వీడాలి. గృహ, వ్యవసాయ కనక్షన్లపై ఏసీడీ విధిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

Updated Date - 2023-01-25T00:53:36+05:30 IST