నేటి నుంచి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-02-01T01:41:41+05:30 IST

అర్వపల్లి మండల కేంద్రం లోని యోగానందలక్ష్మీనర్సింహస్వామి ఆలయం, హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టుపై సీతారామచంద్రస్వామి ఆలయ బహ్మోత్స వాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు
ముస్తాబైన అర్వపల్లిలోని యోగానందలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం

అర్వపల్లి, హుజూర్‌నగర్‌, జనవరి 31: అర్వపల్లి మండల కేంద్రం లోని యోగానందలక్ష్మీనర్సింహస్వామి ఆలయం, హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టుపై సీతారామచంద్రస్వామి ఆలయ బహ్మోత్స వాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యోగానంద లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 18వ తేదీ వరకు, సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల తొమ్మిదో తేదీ వరకు నిర్వహించను న్నారు. ఈ సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

కాకతీయుల సామంతరాజైన అన్నపురాజు కాలం నుంచి అర్వపల్లి యోగానందలక్ష్మీనర్సింహస్వామి ఆలయం నిత్య పూజలతో విరాజిల్లుతోంది. ఆనాడు ఆలయ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎడ్ల బండ్లపై, కాలి నడకన వచ్చి అడవిలో ఉన్న ఈ దేవాలయంలో మొక్కులు చెల్లించుకుని వెళ్లేవారు. స్వామివారికి 750 ఎకరాల మాన్యం ఉంది.

ఇవీ యోగానందలక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు

1వ తేదీన తొళకం ద్రావిడ పఠనం, 2న అధ్యయనోత్సవం, 3న పరమపదోత్సవం, 4నధ్వజారోహణపఠనం, 5న కల్యాణం, 6న గరుడోత్సవం, 7న రథోత్సవం, 8న చక్రతీర్థపూర్ణాహుతి, 9న పొన్నోత్సవం, 10న హన్మంతసేవ, 11న హంసవాహనసేవ, 12న గజవాహనసేవ, 13న శేషవాహనసేవ, 14న దేవరాజసేవ, 15న పారువేట, 16న దొంగలదొపు, 17న ద్వాదశ ప్రదక్షిణలు, 18న డోలోత్సవం నిర్వహించనున్నారు. దేవాలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, ఆలయకమిటీ చైర్మన్‌ చిల్లంచర్ల విద్యాసాగర్‌, సర్పంచ్‌ బైరబోయిన సునితరామలింగయ్య, ఎంపీటీసీ కనుకు పద్మశ్రీనివాస్‌ కృషి చేస్తున్నారు.

సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వివరాలు..

ఫణిగిరి గట్టుపై ఉన్న స్వయంభు శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుజూర్‌నగర్‌లోని రామాలయంలో బుధవారం తెల్లవారు జామున అధ్యయనోత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు అధ్యయనోత్సవాలు, 4న సీతారాముల ఉత్సవ విగ్రహాలను పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారు డిగా అలంకరించి అదేరోజు సాయంత్రం రామాలయంలోని ఫణిగిరి గట్టుపైకి చేరుస్తారు. 5వ తేదీ అర్ధరాత్రి స్వామివారి కల్యాణం, 6న ఫణిగిరి గట్టు వద్ద ఎడ్ల పందాలు, అన్నదాన కార్యక్రమాలు,సాంస్కృతిక కార్యక్ర మాలు, జాతర, 7వ తేదీన గట్టుపైన దోపు ఉత్సవం, భజనలు, హరికథలు తదితర కార్యక్రమాలు,. 8న కల్యాణమూర్తులను ఫణిగిరి గట్టుపై నుండి పట్టణంలోని రామాలయానికి తీసుకువస్తారు. 9న అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథాగానం, హరినామసంకీర్తన, పవళింపు సేవతో కల్యాణ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-02-01T01:41:43+05:30 IST