‘కంటి వెలుగు’తో అంధత్వ సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2023-01-26T00:31:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజల అంధత్వ సమస్యలు పరిష్కారం అవుతాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.మల్లిఖార్జున్‌రావు అన్నారు.

 ‘కంటి వెలుగు’తో అంధత్వ సమస్యలు పరిష్కారం

భువనగిరి టౌన్‌/ భూదాన్‌పోచంపల్లి, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజల అంధత్వ సమస్యలు పరిష్కారం అవుతాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.మల్లిఖార్జున్‌రావు అన్నారు. భువనగిరి పట్టణంలోని 17వ వార్డులో బుధవారం నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో, భూదాన్‌పోచంపల్లి పట్టణంలో ఆయన మాట్లాడారు. ఆరు రోజులుగా కొనసాగిన ఈ శిబిరంలో 1,030 మందికి నేత్ర పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రశాంత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ బి.నాగిరెడ్డి, కౌన్సిలర్లు చెన్న స్వాతి మహేష్‌, ఏవీ.కిరణ్‌కుమార్‌, విశ్రాంత తహసీల్దార్‌ కె.మోహన్‌రెడ్డి, గాదె శ్రీనివాస్‌, డాక్టర్‌ వివేకానంద పాల్గొన్నారు. కాగా బుధవారం జిల్లా వ్యాప్తంగా 3861 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 937 మందికి రీడింగ్‌ అద్దాలు అందజేశారు. 587మందికి 15 రోజుల్లో ప్రిస్కిప్షన్‌ అద్దాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోచంపల్లిలో కంటి వెలుగు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించారు.

Updated Date - 2023-01-26T00:31:25+05:30 IST