కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2023-02-07T00:49:18+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వవార్డులో హాత సే హాత జోడో అభియాన పాదయాత్రను ప్రారంభించి, మాట్లాడారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన : కాంగ్రెస్‌
తుంగతుర్తిలో ప్రసంగిస్తున్న డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్‌

సూర్యాపేటటౌన / తుంగతుర్తి, ఫిబ్రవరి 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వవార్డులో హాత సే హాత జోడో అభియాన పాదయాత్రను ప్రారంభించి, మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో పెట్రోల్‌, వంటగ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో పట్టణంలో 5 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేస్తే, రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పాలనలో కేవలం 191 డబల్‌బెడ్‌రూం ఇళ్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తిరుమలప్రగడ అనురాధ కిషనరావు, అంజద్‌అలీ, వీరన్ననాయక్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, వేములకొండ పద్మ, అన్నమయ్యరాము, నరేందర్‌నాయుడు, ఆలేటి మాణిక్యం, తూముల సురేష్‌, మన్యం అరుణ, గుద్దేటి వెంకన్న, చెరుకు రాము పాల్గొన్నారు. అదేవిధంగా తుంగతుర్తి మండల కేంద్రంలో చేపట్టిన హాత సే హాత జోడో యాత్రను డీసీసీ మాజీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ ప్రారంభించారు. అంతకుముందు రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం్లలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం మాట్లాడుతూ తుంగతుర్తిలో అధికార పార్టీ అరాచకపాలన నడుస్తోందన్నారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని, ఎవరికీ భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో జోడోయాత్ర కన్వీనర్‌ గుడిపాటి నర్సయ్య, వడ్డెపల్లి రవి, కిషనరావు, చిరంజీవి, ఎల్సోజు నరేష్‌, రాజయ్య, అవిలమల్లు, కృష్ణమూర్తి, కందుకూరి అంబేడ్కర్‌, గోవర్దన, రమేష్‌, కొండ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:49:22+05:30 IST