పోటెత్తిన పెద్దగట్టు

ABN , First Publish Date - 2023-02-07T01:24:40+05:30 IST

ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి జాతర ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి పెద్దఎత్తున గట్టుకు తరలివచ్చారు.

పోటెత్తిన పెద్దగట్టు
పెద్ద గట్టు జాతరలో భక్తుల రద్దీ

ఓ లింగా.. ఓలింగా నామస్మరణతో మార్మోగిన జాతర ప్రాంగణం

భానుపురి, సూర్యాపేట(కలెక్టరేట్‌), చివ్వెంల, ఫిబ్రవరి 6: ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి జాతర ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి పెద్దఎత్తున గట్టుకు తరలివచ్చారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ పెరిగింది. యువతి, యువకులు జాతరలో పీక బూరలు ఊదుతూ సందడి చేశారు. జాత రలో వ్యాపారులు నిలువు దోపిడీ చేశారు. నాణ్యతలేని తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.

నిలిచిపోయిన మిషన్‌భగీరథ నీరు

మిషన్‌భగీరథ నీరు సరఫరా గుట్టపైకి గంట పైగా నిలిచిపోయింది. దీంతో జంతుబలి చేస్తున్న ప్రాంతమంతా రక్తంతో దుర్గంధం వెదజల్లింది. రెండు మోటార్లకు బదులుగా మూడు మోటార్లను వినియోగించడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

జాతీయ రహదారిపై ఇక్కట్లు

మంత్రులు, ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌తో ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో దురాజ్‌పల్లి జాతీయ రహదారిపై భక్తులు ఇబ్బంది పడ్డారు.

కోనేరులో పెద్ద సంఖ్యలో స్నానాలు

గుట్ట కింద నిర్మించిన కోనేరులో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ ఈతలు కొట్టారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు.

ఏరులై పారిన మద్యం

జాతరలో మద్యం ఏరులై పారింది. జాతర సమీపంలో ఉన్న దురాజ్‌పల్లి, రాంకోటితండా, మున్యానాయక్‌తండా, ఖాశీంపేట, వల్లభాపురం గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.

తాగునీటికి కటకట

జాతరకు వచ్చిన భక్తులు తాగు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భక్తులు, పోలీసులు, జాతరలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తాగునీటి కోసం అల్లాడారు.

ఆరాధ్యదైవం లింగమంతుల స్వామి

యాదవుల ఆరాధ్యదైవం లింగమంతులస్వామి అని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. లింగమంతుల స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సంద ర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు.

‘రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం’

రాబోయే ఎన్నికలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అధిక నిధులు కేటాయిస్తామని బీజేపీ నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామిని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలం: మురళి, విమలక్క

జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించకుండా బడ్జెట్‌లో కేవలం రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చిందని మురళి విమర్శించారు.

బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ

జాతర బందోబస్తును ఎస్పీ రాజేందర్‌ప్రసాద్‌ పర్య వేక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన స్ర్కీన్‌ల ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో తని ఖీలు చేసినా దొంగలు చేతివాటం ప్రదర్శించారు.

గొంగళ్లకు భలే గిరాకీ

పెద్దగట్టు జాతరలో గొంగళ్లకు భలే గిరాకీ ఉంది. పెద్దగట్టు పైన, గట్టుకు ఇరువైపులా చాలా మంది గొంగళ్లను విక్రయించారు. ఒక్కో గొంగ ళిని సైజు ప్రకారం రూ.1200 నుంచి రూ.1400 వరకు గ్రామాల నుండి వచ్చిన భక్తులు గొంగళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.

సౌకర్యాలు కల్పిచడంలో మంత్రి విఫలం: బీజేపీ

రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరైన పెద్దగట్టు జాత రకు సౌకర్యాలు కల్పించడంలో మంత్రి జగదీష్‌రెడ్డి విఫలమయ్యాడని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. జాతర సందర్భంగా స్వామిని దర్శించుకుని ఆయన మాట్లాడారు. జగదీష్‌రెడ్డి గెలిచిన తర్వాత పెద్దగట్టు జాతరకు రూ.18కోట్ల నిధులు విడుదలైతే చెప్పుకోదగిన శాశ్వత పనులు ఏవీ లేవన్నారు.

స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

లింగమంతులస్వామిని మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రులకు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ కోడి సైదులుయాదవ్‌, ఆలయ ఈవో కుశలయ్య సన్మానంతో పాటు జ్ఙాపికలను అందజేశారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్‌, కంచర్ల భూపాల్‌ రెడ్డి, నోముల భగత్‌తో పాటు రాష్ట్ర సమాచార మాజీ ప్రధాన కమిషనర్‌ వర్రె వెంకటేశ్వర్లుతో పాటు మరికొంత మంది స్వామి వారిని దర్శించుకున్నారు.

మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-02-07T01:24:43+05:30 IST