400 జిలిటెన్‌ స్టిక్స్‌, 400 డిటోనేటర్స్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2023-02-07T00:08:51+05:30 IST

పేలుడు పదార్థాలపై రాచకొండ కమిషనరేట్‌ యాదాద్రి జోన్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

400 జిలిటెన్‌ స్టిక్స్‌, 400 డిటోనేటర్స్‌ స్వాధీనం

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 6: పేలుడు పదార్థాలపై రాచకొండ కమిషనరేట్‌ యాదాద్రి జోన్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 11రోజుల వ్యవధి లోనే జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీగా జిలిటెన్‌స్టిక్స్‌, డిటోనేటర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాజేష్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ నుంచి అక్రమంగా పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘాలో గుండాల మండలం మర్రిపాడల వద్ద అను మానాస్పద స్థితిలో వెళ్తున్న ఆటోను ఆపి పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న 400 జిలిటెన్‌స్టిక్స్‌, 400 డిటోనేటర్స్‌, నా లుగు కనెక్టింగ్‌ వైర్‌ బిండల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు దున్నపోతుల యాదయ్య, శివరాత్రి యాదగిరి, వనం కనకరాజు, గోసంగి యే సోబును అదుపులోకి తీసుకోగా వీరారెడ్డి పరారయ్యాడు. నిందితులను విచా రించగా అక్రమంగా కొనుగోలు చేసిన పేలుడు పదార్ధాలను పలువురికి విక్రయిస్తున్నట్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌, బ్లాస్టింగ్స్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. కేసు నమోదు చేసుకొని నలుగురు నిందితులతో పాటు వస్తువులను సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కాగా గత నెల 27న కూడా ఆలేరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జేఎస్‌ఆర్‌ సన్‌సిటీ వెంచర్‌లో అక్రమ పేళుళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఎస్‌వోటీ, ఆలేరు పోలీ సులు జరిపిన దాడుల్లో నలుగురు నిందితులు పట్టుబడగా 57జిలిటెన్‌స్టిక్స్‌, 51 డిటోనేటర్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ సమావేశంలో ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ నవీన్‌రెడ్డి, గుండాల ఎస్‌ఐ. యాకన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:08:55+05:30 IST