ఎంపీ వస్తే లేచి నిలబడరా

ABN , First Publish Date - 2023-01-26T01:40:34+05:30 IST

మంచిర్యాల జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత హల్‌చల్‌ చేశారు. ప్రొటోకాల్‌

ఎంపీ వస్తే లేచి నిలబడరా

మంచిర్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత హల్‌చల్‌ చేశారు. ప్రొటోకాల్‌ పాటించలేదంటూ జడ్పీ సీఈవోపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. బుధవా రం ఉదయం సమావేశం ప్రారంభమైంది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై సభ్యులు అధికారులతో ఏకరువు పెడుతున్నారు. ఈ క్రమంలో 12.35 గంటలకు ఎంపీ సమావేశ మందిరంలోకి వచ్చారు. వచ్చీ రాగానే ఆగ్రహంతో ఊగిపోయారు. తాను వస్తే లేచి నిలబడరా అంటూ జడ్పీ సీఈవో నరేందర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొటోకాల్‌ పాటించలేదంటూ ఊగిపోయారు. ‘యూ స్టాండప్‌... స్టాండప్‌ ఐ సే’ అంటూ సీఈవోను ఉద్దేశించి అరవడంతో ఆయన ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఎవరు వచ్చారో చూసుకోవద్దా... అంటూ ఊగిపోయారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేయిపట్టుకొని మరీ వారిస్తున్నా వినిపించుకోకుండా ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ కార్యక్రమంలో వేదికపై సీఈవోతో పాటు కలెక్టర్‌ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కూడా ఉన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని సీఈవోకు సూచించారు.

Updated Date - 2023-01-26T01:40:38+05:30 IST