MLC Jeevan Reddy: గత బడ్జెట్‌నే రిపీట్ చేసింది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-02-06T17:40:06+05:30 IST

కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం గత బడ్జెట్‌నే రిపీట్ చేసిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు.

MLC Jeevan Reddy: గత బడ్జెట్‌నే రిపీట్ చేసింది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం గత బడ్జెట్‌నే రిపీట్ చేసిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. రుణమాఫీని ఇప్పటివరకు పూర్తి చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధులో కేటాయింపులు పెంచలేదని, హౌసింగ్‌ బోర్డ్‌ను ఎత్తేశారని మండిపడ్డారు. స్వయంఉపాధిపై భరోసా కల్పించలేకపోయారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి సరిగ్గా చేయడం లేదన్నారు. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ బాధితులు పెరుగుతున్నారని, గల్ఫ్‌ సహాయనిధి పెంచాలని జీవన్‌రెడ్డి సూచించారు. గల్ఫ్‌లో మృతిచెందినవారి కుటుంబాలకు సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-06T17:40:10+05:30 IST