కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న సిరిసిల్ల జోన్‌ డీఐజీ

ABN , First Publish Date - 2023-01-25T00:26:38+05:30 IST

సిద్దిపేట పోలీ్‌సకమిషనరేట్‌ కార్యాలయాన్ని రాజన్నసిరిసిల్ల జోన్‌ డీఐజీ రమేశ్‌నాయుడు మంగళవారం సందర్శించారు.

కమిషనరేట్‌ను సందర్శించిన  రాజన్న సిరిసిల్ల జోన్‌ డీఐజీ
కమిషనరేట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా డీఐజీ రమేశ్‌నాయుడు

సిద్దిపేటక్రైం, జనవరి 24: సిద్దిపేట పోలీ్‌సకమిషనరేట్‌ కార్యాలయాన్ని రాజన్నసిరిసిల్ల జోన్‌ డీఐజీ రమేశ్‌నాయుడు మంగళవారం సందర్శించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఆయనకు మొక్కను అందజేశారు. అనంతరం సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి, సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్స్‌, జిల్లాలో ఉన్న పోలీ్‌సస్టేషన్ల, నియోజకవర్గాల గురించి, భౌగోళిక పరిధి గురించి వివరించారు. డీఐజీ రమేశ్‌నాయుడు అధికారులతో సమావేశమై జిల్లాలో ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అండర్‌ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల గురించి పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్షన్స్‌ ఇయర్‌ ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని చెప్పారు. కమిషనరేట్‌ కార్యాలయం పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నదని, పోలీసుల పనితీరు బాగుందని పోలీస్‌ అధికారులను అభినందించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్‌ చంద్రబోస్‌, గజ్వేల్‌ ఏసీపీ రమేశ్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ఫణిందర్‌, హుస్నాబాద్‌ ఏసీపీ సతీష్‌, ఎస్బీ ఏసీపీ రవీందర్‌రాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రఘుపతిరెడ్డి, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌, సీఐలు, ఆర్‌ఐలు ఏవో యాదమ్మ, పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:26:38+05:30 IST