గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరు అందిస్తాం

ABN , First Publish Date - 2023-01-24T23:37:54+05:30 IST

హుస్నాబాద్‌రూరల్‌, జనవరి 24: భూనిర్వాసితుల సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి త్వరలోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందించి హుస్నాబాద్‌ మెట్ట ప్రాంతాన్ని సాగురంలో సస్యశ్యామలం చేస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరు అందిస్తాం
కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌

హుస్నాబాద్‌రూరల్‌, జనవరి 24: భూనిర్వాసితుల సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి త్వరలోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందించి హుస్నాబాద్‌ మెట్ట ప్రాంతాన్ని సాగురంలో సస్యశ్యామలం చేస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేసి మాట్లాడారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు రావాల్సిన పరిహారం దాదాపు అందజేశామన్నారు. హుస్నాబాద్‌ మున్సిపల్‌ పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్టుదల, కృషితో పట్టణానికి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం 21 మందికి సీఎం సహాయనిధి ద్వారా రూ.6.65 లక్షల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ మానస, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్మన్‌ అయిలేని అనిత, ఎంపీడీవో కుమారస్వామి, తహసీల్దార్‌ పాల్గొన్నారు. అలాగే హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. హరీశ్‌రావు ప్రత్యేకంగా అందజేస్తున్న పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేశారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఏర్పాటుచేసిన వాసవీ వెంచర్‌ను ప్రారంభించారు.

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

కోహెడ, జనవరి 24: పేదలకు సీఎం సహాయనిధి ఎంతో దోహద పడుతుందని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని 55 మంది లబ్ధిదారులకు రూ.15,33,500 సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. ఎంపీపీ కీర్తి, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్‌, సర్పంచులు పాల్గొన్నారు.

కబ్జాదారుల నుంచి మా ప్లాట్లు ఇప్పించండి

హుస్నాబాద్‌, జనవరి 24: పైసపైసా కూడబెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు కబ్జాచేసి మాకు దక్కకుండా చేస్తున్నారని 100 మంది బాధితులు మంగళవారం హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌కు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. హుస్నాబాద్‌లోని సబ్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న భూమిని 2009లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి కొనుగోలు చేశామని వెల్లడించారు. వారు చిట్టి ప్రద్యుమ్నారెడ్డి అనే వ్యక్తికి జీపీఏ చేయగా ఆయన దాదాపు వందమందికి పైగా ప్లాట్లను కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. ఇప్పటివరకు ప్లాట్ల యజమానులుగా కొనసాగుతున్నామని, ఈసీలు కూడా మా పేరిట ఉన్నాయన్నారు. 2019లో కొందరు వ్యక్తులు తమ హద్దురాళ్లను ధ్వంసం చేసి మాపై దౌర్జన్యం చేశారని తెలిపారు. ఈ విషయంపై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేసినా ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఇందులో బాధితులు సంపత్‌రెడ్డి, బైరి రవి, పూర్ణచందర్‌, వీరస్వామి, కనుకస్వామి, భాగ్య, రాజయ్య ఉన్నారు.

Updated Date - 2023-01-24T23:37:54+05:30 IST