వసంత పంచమి మహోత్సవానికి విద్యాధరి ముస్తాబు

ABN , First Publish Date - 2023-01-25T23:44:43+05:30 IST

వర్గల్‌ విద్యాధరి క్షేత్రం గురువారం జరిగే వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది.

వసంత పంచమి మహోత్సవానికి విద్యాధరి ముస్తాబు
విద్యుత్‌దీపాల వెలుగులో విద్యాధరి క్షేత్రం

విద్యుత్‌ కాంతులీనుతున్న శంభుగిరి కొండలు

వర్గల్‌, జనవరి 25: వర్గల్‌ విద్యాధరి క్షేత్రం గురువారం జరిగే వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. వసంత పంచమి సందర్భంగా క్షేత్రంలోని ఆలయాలు విద్యుత్‌ దివ్వెలతో కాంతులీనుతున్నవి. విద్యాధరి క్షేత్రంలో ఉదయం నాలుగు గంటల నుంచే ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆలయం వద్ద అక్షరాభ్యాసం కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకునే విధంగా ప్రత్యేక మంటపాలను ఏర్పాటు చేశారు. అలాగే దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీల దర్శనం కోసం మరో క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. వేడుకలకు వేలాది మంది తరలిరానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పలువురు స్వామీజీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వేడుకలకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎ్‌సఆర్టీసీ ద్వారా విద్యాధరి క్షేత్రానికి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వసంత పంచమి సందర్భంగా రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో బుధవారం రాత్రి విద్యాధరి క్షేత్రం ప్రకాశవంతమై కనిపించింది.

Updated Date - 2023-01-25T23:44:43+05:30 IST