ఓటు హక్కు ఎంతో విలువైనది

ABN , First Publish Date - 2023-01-25T23:28:13+05:30 IST

నారాయణరావుపేట, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అన్నారు. బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

ఓటు హక్కు ఎంతో విలువైనది

ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ

పలు మండలాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం

నారాయణరావుపేట, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అన్నారు. బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు దొంగల వెంకటమ్మను అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మురళీధర్‌శర్మ, తహసీల్దార్‌ ఉమారాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రభాకరరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

దుబ్బాక/మిరుదొడ్డి: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కచ్చితంగా ఓటుహక్కును కలిగి ఉండాలని దుబ్బాక, మిరుదొడ్డి, అక్డర్‌పేట-భూంపల్లి మండలాల తహసీల్దార్లు సలీం, ఉదయశ్రీ, వీరేష్‌ అన్నారు. బుధవారం దుబ్బాక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జాతీయ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని 80 ఏళ్ల వృద్ధులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డితో కలిసి వారిని ఘనంగా సన్మానించారు. అలాగే మిరుదొడ్డి, అక్బర్‌పేట-భూంపల్లి మండలాల్లో కూడా జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు.

మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ఎల్‌.భూపతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివా్‌సగౌడ్‌, సర్పంచ్‌ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ బొప్పె కనకమ్మ, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చేర్యాల: చేర్యాల పెద్దమ్మగడ్డ జడ్పీఎ్‌సఎ్‌సలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆరీఫాబేగం సీనియన్‌ సిటిజన్‌ ఓటర్లను సన్మానించారు. నూతన ఓటరుకు గుర్తింపుకార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడ్‌ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు.

రాయపోల్‌: రాయపోల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మానవహారం ఏర్పాటుచేసి ప్రతిజ్ఞ చేశారు. సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అనిత, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇప్ప లక్ష్మి, సర్పంచ్‌ మౌనిక, తహసీల్దార్‌ సహదేవ్‌, ఎంపీడీవో మునయ్య, తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌ టౌన్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో బుధవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎన్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నల్ల రాంచంద్రారెడ్డి, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కరుణాకర్‌, రవీందర్‌, సదానందం, లక్ష్మమ్మ, కవిత, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:28:13+05:30 IST