స్వీప్‌ నోడల్‌ అధికారికి రాష్ట్రస్థాయి స్పెషల్‌ జ్యూరీ అవార్డు

ABN , First Publish Date - 2023-01-25T23:55:28+05:30 IST

జిల్లాలో ఓటర్ల నమోదు, ఆధార్‌ అనుసంధానం, స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణలో చేసిన కృషికి రాష్ట్రస్థాయిలో స్పెషల్‌ కేటగిరి అవార్డుకు మెదక్‌ జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి రాజిరెడ్డి ఎంపికయ్యారు.

స్వీప్‌ నోడల్‌ అధికారికి రాష్ట్రస్థాయి స్పెషల్‌ జ్యూరీ అవార్డు
రాజిరెడ్డిని అవార్డుతో సన్మానిస్తున్న ప్రతిమాసింగ్‌

మెదక్‌ అర్బన్‌, జనవరి 25: జిల్లాలో ఓటర్ల నమోదు, ఆధార్‌ అనుసంధానం, స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణలో చేసిన కృషికి రాష్ట్రస్థాయిలో స్పెషల్‌ కేటగిరి అవార్డుకు మెదక్‌ జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి రాజిరెడ్డి ఎంపికయ్యారు. ప్రత్యేక ఓటర్ల సవరణ, నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు తదితర అంశాల్లో రాష్ట్రస్థాయిలో విశేష సేవలందించిన ఉత్తమ అధికారులతో పాటు బూత్‌స్థాయి అధికారులకు అవార్డులు ప్రకటిస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లాలకు వర్తమానం పంపింది. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అవార్డును రాజిరెడ్డికి అందజేసి, సన్మానించారు.

Updated Date - 2023-01-25T23:55:28+05:30 IST