స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలి

ABN , First Publish Date - 2023-01-24T23:42:24+05:30 IST

ఏబీవీపీ నాయకుల డిమాండ్‌, విద్యార్థులతో కలిసి నిరసనలు

స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలి
సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి రూరల్‌/సంగారెడ్డి అర్బన్‌/రామాయంపేట, జనవరి 24: పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌ప్సను వెంటనే విడుదల చేయలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.3,500 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాశాల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ.3 వేలకు, పాఠశాల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను నెలకు రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలని కోరారు. ధర్నాలో శ్యామ్‌, గోవర్ధన్‌ చారి, నితీస్‌, రాజన్‌, సుదర్శన్‌చారి, ప్రభాకర్‌, చింటూ, ఆశి్‌షగౌడ్‌, మనోహర్‌ పాల్గొన్నారు. స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని తారా కళాశాల ప్రాంగణంలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఆకాశ్‌, నగర విస్తారక్‌ శిరీష, రాష్ట్రకార్యవర్గసభ్యులు పూజగౌడ్‌, శశాంక్‌, తారా కళాశాల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. రామాయంపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.

Updated Date - 2023-01-24T23:42:25+05:30 IST