పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-02-04T23:32:45+05:30 IST

జగదేవ్‌ పూర్‌, ఫిబ్రవరి 4: గ్రామాల్లో పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి సూచించారు.

పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

జగదేవ్‌ పూర్‌, ఫిబ్రవరి 4: గ్రామాల్లో పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి సూచించారు. శనివారం ఎంపీపీ బాలేషంగౌడ్‌ అధ్యక్షతన జగదేవ్‌పూర్‌ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ట్రాన్స్‌ కో ఏఈ రాజేంద్రప్రసాద్‌ తమ నివేదికను చదవగా సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఇటిక్యాల సర్పంచ్‌చంద్రశేఖర్‌ తమ గ్రామంలో బినామీ రైతుల పేర్లతో డీడీ కట్టడం వల్ల బిల్లుల విషయంలో ఇతర రైతులు విద్యుత్‌ కష్టాలు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఏఈ స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీర్లపల్లి గ్రామంలోని 199 సర్వే నంబర్‌లో రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకురాగా.. తహసీల్దార్‌ రఘువీరారెడ్డి స్పందించి ఆ భూమిలో నుంచి త్రిబుల్‌ ఆర్‌కు కొంతభూమి పోతుందని, మిగిలిన భూమిని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామంలోని 49 సర్వే నంబర్‌ గల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని చర్యలు తీసుకోవాలని కోరారు. తిగుల్‌ సర్పంచ్‌ భానుప్రకా్‌షరావు మాట్లాడుతూ గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉన్నదని, పూర్తిచేయాలని గడ దృష్టికి తీసుకుపోయారు. గడ అధికారి ముత్యంరెడ్డి స్పందించి ఆలయం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ వర్మ, తహసీల్దార్‌ రఘువీరారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ చైర్మన్‌ రంగారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ఉపేందర్‌రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ భగవాన్‌తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:32:46+05:30 IST