మల్లన్నసాగర్‌తో బీడుభూములు సస్యశ్యామలం

ABN , First Publish Date - 2023-02-04T23:31:09+05:30 IST

మిరుదొడ్డి, ఫిబ్రవరి 4: మల్లన్నసాగర్‌ నిర్మాణంతో దుబ్బాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

మల్లన్నసాగర్‌తో బీడుభూములు సస్యశ్యామలం
మిరుదొడ్డి మండలం అల్వాల్‌లో మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

మిరుదొడ్డి, ఫిబ్రవరి 4: మల్లన్నసాగర్‌ నిర్మాణంతో దుబ్బాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మిరుదొడ్డి మండలం అల్వాల్‌ గ్రామంలో ముదిరాజ్‌, ఎస్సీ, మాదిగ, శాలివాహన, గౌడ కమ్యూనిటీహాళ్లకు భూమిపూజ చేయడంతో పాటు మైనార్టీ భవన ప్రహరీని ఆయన ప్రారంభించారు. కూడవెళ్లి వాగు ప్రవహిస్తే దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాలకు ఎక్కువగా లాభం చేకూరుతుందని, ఆ కూడవెళ్లి వాగులోకి మల్లన్నసాగర్‌ ద్వారా నీటిని పంపి జీవనదిగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల సభ్యులు ఎంపీని శాలువాతో సన్మానించారు. అనంతరం మిరుదొడ్డి జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. అలాగే నెలరోజుల నుంచి మిరుదొడ్డిలో నిర్వహిస్తున్న కేపీఆర్‌ కప్‌ ఫైనల్‌లో గెలుపొందిన దుబ్బాక మున్సిపాలిటీలోని మల్లాయిపల్లి వార్డుకు కేపీఆర్‌ చేతులమీదుగా కప్‌తోపాటు రూ.30 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణ, ఆత్మకమిటీ చైర్మన్‌ భాస్కరచారి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాజు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మల్లేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్‌రాజు, ఆయాగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కిష్టయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్‌, నర్సింలు, నాయకులు అంజిరెడ్డి, తోట కమలార్‌రెడ్డి, బాపురెడ్డి, భూపతిగౌడ్‌, సుజాత, నర్సింలు, దిలిప్‌, స్వామి, నితిన్‌, మల్లయ్య, తదితరులున్నారు.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎంపీ

తొగుట, ఫిబ్రవరి 4: దేశ ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు దైవాశిస్సులు నిండుగా ఉన్నాయని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తొగుట మండలం ఘనపూర్‌ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం ఆయన హాజరుకాగా, ఆలయ అర్చకులు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులు పలు విద్యుత్‌ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ట్రాన్స్‌కో డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు.

Updated Date - 2023-02-04T23:31:11+05:30 IST