‘గుడికందుల’ అభివృద్ధికి సహకారం అందిస్తా

ABN , First Publish Date - 2023-01-24T23:34:52+05:30 IST

తొగుట, జనవరి 24: తొగుట మండలం గుడికందుల గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

‘గుడికందుల’ అభివృద్ధికి సహకారం అందిస్తా
గుడికందులలో భైరవస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

తొగుట, జనవరి 24: తొగుట మండలం గుడికందుల గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గుడికందుల గ్రామంలో మంగళవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మిస్తున్న ముదిరాజ్‌ భవనం, రజక సంఘం, రెడ్డి సంఘం భవన నిర్మాణ పనుల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు. రెడ్డి సంఘం ఫంక్షన్‌హాల్‌ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీఇచ్చారు. దాంతోపాటు ఎస్సీ కమ్యూనిటీహాల్‌ భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ నాయకుడు ఈశ్వర్‌ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించగా..వారి కుటుంబాన్ని, అదే గ్రామానికి చెందిన సయ్యద్‌, పోచయ్య, సిద్దిరాములు, రాజిరెడ్డి కుటుంబాలను ఎంపీ పరామర్శించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీఇచ్చారు. అనంతరం తొగుటలో ఇటీవల అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లేశం, గుండెపోటుతో మృతిచెందిన రామెల్లా కర్ణాకర్‌ కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, కోఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమురయ్య, సర్పంచ్‌ మల్లయ్య పాల్గొన్నారు.

కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎంపీ

దుబ్బాక, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులసంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో రూ.20 లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నదన్నారు. అనంతరం అక్బర్‌పేట-భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామంలోని ఉచిత వాటర్‌ క్యాన్లను పంపిణీ చేశారు. అలాగే పొతరెడ్డిపేట గ్రామంలోని రేణుకాఎల్లమ్మ ఆలయ సిద్దియోగంలో పాల్గొని ప్రత్యేక పూజలను చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితాభూంరెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాస్‌ తదితరులున్నారు. అనంతరం దుబ్బాకలోని పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మార్కండేయ జయంతిలో పాల్గొని పూజలు చేశారు.

Updated Date - 2023-01-24T23:34:52+05:30 IST