పట్టణ ప్రజలకు ఐదువేల ఇళ్లను అందించాలి

ABN , First Publish Date - 2023-02-05T23:10:14+05:30 IST

జ్వేల్‌, ఫిబ్రవరి 5: పట్టణ ప్రజలకు ఐదువేల ఇళ్లను అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గజ్వేల్‌ పట్టణ ఇన్‌చార్జి ధరం గురువారెడ్డి డిమాండ్‌ చే శారు.

పట్టణ ప్రజలకు ఐదువేల ఇళ్లను అందించాలి
గజ్వేల్‌లోని శిశుమందిర్‌లో పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న గురువారెడ్డి

బీజేపీ గజ్వేల్‌ పట్టణ ఇన్‌చార్జి ధరం గురువారెడ్డి

గజ్వేల్‌, ఫిబ్రవరి 5: పట్టణ ప్రజలకు ఐదువేల ఇళ్లను అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గజ్వేల్‌ పట్టణ ఇన్‌చార్జి ధరం గురువారెడ్డి డిమాండ్‌ చే శారు. గజ్వేల్‌ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో గజ్వేల్‌ పట్టణ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించగా, ఆయన హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీమేరకు ఐదువేల ఇళ్లను నిర్మాణం చేసి అందించాలని, పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులైన యూజీడీ, సీసీ రోడ్లు, కోటమైసమ్మ రోడ్డు, క్రీడా హాబ్‌లను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. వారితో బీజేపీ సీనియర్‌ నాయకులు యెల్లు రాంరెడ్డి, చిలివేరి జనార్ధన్‌, జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌, బీజేపీ ఎస్సీ మెర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ తదితరులున్నారు.

బీజేపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి

కోహెడ, ఫిబ్రవరి 5: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కలికట్టుగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జుల సత్యనారాయణరావు, అసెంబ్లీ కన్వీనర్‌ గుర్రాల లక్ష్మారెడ్డి, సూర్యాపేట ఇన్‌చార్జి చాడ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఆదివారం కోహెడలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో హుస్నాబాద్‌లో ఎగిరేది బీజేపీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ తడిసిన రాజశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్‌ జనగామ వేణుగోపాల్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు విజయపాల్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు కమ్మం వెంకటేశం పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

కొండపాక, ఫిబ్రవరి 5: ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కార్యకర్తలు ఎప్పటికప్పుడు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు దారం గురువారెడ్డి అన్నారు. ఆదివారం కొండపాకలో ఉమ్మడి మండలాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామస్వామి, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్‌ యాదవ్‌, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో

తొగుట, ఫిబ్రవరి 5: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద బీజేపీ మండలస్థాయి, శక్తిస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ మండలాధ్యక్షుడు చిక్కుడు చంద్రంముదిరాజ్‌, బీజేపీ శక్తి కేంద్ర అసెంబ్లీ కన్వీనర్‌ ఎస్‌.ఎన్‌.చారి, కో ఆర్డినేటర్‌ విభీషణ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాగానే దళితుడిని సీఎం చేసి కాపలా కుక్కలా ఉంటానని మోసం చేసింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును లక్ష్యంగా కేటీఆర్‌ మాట్లాడటం చూస్తేనే వారికి ఓటమి భయం పట్టుకున్నట్లు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామిరెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్‌, పరమేష్‌, కల్యాణ్‌దాస్‌, ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T23:10:15+05:30 IST