Siddipet: ప్రజల ఓట్లు కావాలి..వారి గోస మాత్రం పట్టించుకోరా..

ABN , First Publish Date - 2023-01-25T09:39:16+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై సిద్దిపేట జిల్లాలో

 Siddipet: ప్రజల ఓట్లు కావాలి..వారి గోస మాత్రం పట్టించుకోరా..

సిద్ధిపేట/అక్కన్నపేట: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటి పల్లె భూ నిర్వాసితులకు రావాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఉన్న పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. రెండు నెలల నుండి అక్కడ ఉన్న ఆడపిల్లలు టెంట్ కింద కూర్చొని నిరసన తెలియజేస్తుంటే అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సోయి లేదా అని మండిపడ్డారు. ఇక్కడి ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచే అధికారం అనుభవిస్తున్నారు కానీ.. ఇక్కడి ప్రజల గోస మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా గౌరవెల్లి భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తూ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు సాగు నీరు తాగునీరు అందించాలన్నారు. ప్రజల అభివృద్ధి కోరుకునే నాయకులైతే త్వరితగతన ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఇక్కడి రైతాంగానికి నీరు ఇవ్వాలని కోరారు. రానున్న రోజుల్లో ఇక్కడి ప్రాంత ప్రజలు రైతులు భూ నిర్వాసితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ భూక్య సరోజన, అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు, గుడాటి పల్లె సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు భువనగిరి రజిత, హుస్నాబాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు బ్లాన్డీన, ఎల్కతుర్తి మహిళా అధ్యక్షురాలు పిన్నింటి సుష్మ, జిల్లా బాధ్యులు రమాదేవి బత్తుల మమతారెడ్డి, శ్వేత కమలమ్మ, అక్కన్నపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాండ్రాల దాము, హుస్నాబాద్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గిడి అయిలయ్య, డైరెక్టర్ బండి కుమార్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, హుస్నాబాద్ ఎస్టి సెల్ బి క్యా నాయక్, మంద పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T09:39:23+05:30 IST