విద్యారంగాన్ని వ్యాపారం చేసిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-02-06T23:57:19+05:30 IST

ఏబీవీపీ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ ప్రవీణ్‌రెడ్డి

విద్యారంగాన్ని వ్యాపారం చేసిన సీఎం కేసీఆర్‌
సంగారెడ్డిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 6: విద్యారంగాన్ని సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనతో వ్యాపారంగా మార్చారని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. ఏబీవీపీ జిల్లా సమ్మేళనం సందర్భంగా సంగారెడ్డిలోని కల్వకుంట రోడ్డులో సోమవారం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ, రాచరిక పాలనను పాతాళంలోకి తొక్కే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని అందని ద్రాక్షలా మార్చారని, శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. అంతకుముందు జిల్లా స్థితి, విద్యారంగ స్థితిపై పలు తీర్మాణాలు చేశారు. అనంతరం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాగత సమితి అధ్యక్షుడు హరీశ్‌, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళింగ కృష్ణకుమార్‌, జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌ అనిల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పూజ, ప్రాంత సహ సంఘటన కార్యదర్శి లవన్‌, ఎస్‌ఎ్‌ఫడీ రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌, విభాగ్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌, జిల్లా కన్వీనర్‌ ఆకాశ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశ్‌పాండే, తపస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:57:20+05:30 IST