భక్త జనసంద్రం.. కొండపోచమ్మ ఆలయం

ABN , First Publish Date - 2023-01-24T23:50:09+05:30 IST

జగదేవ్‌పూర్‌, జనవరి 24: జగదేవ్‌పూర్‌ మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయం వద్ద జాతరకు రెండోరోజు భక్తుల రద్దీ పెరిగింది.

భక్త జనసంద్రం.. కొండపోచమ్మ ఆలయం
కొండపోచమ్మను దర్శించుకుంటున్న భక్తులు

ఉదయం నుంచి రాత్రివరకు భక్తుల రద్దీ

రెండురోజుల్లో లక్ష మంది దర్శనం

జగదేవ్‌పూర్‌, జనవరి 24: జగదేవ్‌పూర్‌ మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయం వద్ద జాతరకు రెండోరోజు భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం ఉదయం నుంచే భక్తులు దర్శనం కోసం క్యూలో గంటల తరబడి బారులుతీరారు. మహిళలు బోనాలను శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లతో వచ్చి సమర్పించారు. అనంతరం ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. రెండోరోజు లక్షమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ రజితారమేష్‌ తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అలరించిన యాదవ సంఘం ధూంధాం

కొండపోచమ్మ ఆలయం వద్ద హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో బోయిని సాయియాదవ్‌ నిర్వహించిన ధూంధాం భక్తులను అలరించింది. రాత్రి ప్రారంభమైన ఈ ధూంధాం తెల్లవారుజాము వరకు కొనసాగింది. హైదరాబాద్‌ కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు సంపూర్ణేష్‌ బాబు, కొమురవెల్లి మాజీ చైర్మన్‌ సంపత్‌కుమార్‌యాదవ్‌, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు

Updated Date - 2023-01-24T23:50:10+05:30 IST