Mangalkanti Roy: కడు పేదరికంలో పద్మశ్రీ గ్రహీత

ABN , First Publish Date - 2023-01-27T02:46:32+05:30 IST

తాను నమ్ముకున్న కళ తనకు ఆర్థికంగా సాయపడలేదని, మరిన్ని బాధలు పడకుండా లోకాన్నే విడవాలనుకుంటున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సరిందా వాయిద్యకారుడు మంగళకంటి రాయ్‌(101) అన్నారు.

Mangalkanti Roy: కడు పేదరికంలో పద్మశ్రీ గ్రహీత

101 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం

జల్పైగురి, జనవరి 26: తాను నమ్ముకున్న కళ తనకు ఆర్థికంగా సాయపడలేదని, మరిన్ని బాధలు పడకుండా లోకాన్నే విడవాలనుకుంటున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సరిందా వాయిద్యకారుడు మంగళకంటి రాయ్‌(101) అన్నారు. బెంగాల్‌కు చెందిన ఆయనకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నా ఒంటరి జీవితం వెళ్లదీస్తున్నారు. అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, కానీ పేరు తెచ్చిన కళ తనకు ఆర్ధికంగా ఏ మాత్రం ఉపయోగపడలేదని పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల తన పరిస్థితి మరింత దిగజారిందని, రెండేళ్ల నుంచి ప్రదర్శలకు ఎవరూ పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-27T08:13:37+05:30 IST