ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో పవిత్రం
ABN , First Publish Date - 2023-01-25T23:23:54+05:30 IST
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో పవిత్రమైందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశపు హాలులో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవం
- ర్యాలీలు నిర్వహించిన విద్యార్థులు
- ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రతిజ్ఞ
గద్వాల క్రైం/ గద్వాల రూరల్/ అలంపూర్/ వడ్డేపల్లి/ ఉండవల్లి/ మల్దకల్/ కేటీదొడ్డి/ రాజోలి, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో పవిత్రమైందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశపు హాలులో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఆడియోను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచి, ఎలాంటి ప్రలోభాలాకు లొంగకుండా కులం, మతం, వర్గం, భాష, ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్బంగా పలు పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన బిందు, నందిని, శిరీషలకు కలెక్టర్ బహుమతులను పంపిణీ చేసారు. నూతన ఓటర్‌గా నమోదు చేసుకున్న వర్షిత్ నీల్రాజ్కు కలెక్టర్ చేతుల మీదుగా ఓటర్ ఐడీ కార్డును అందించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఓటు హక్కు మన పిల్లల భవిష్యత్తు : ఎస్పీ
మనం వేసే ఓటు, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో సతీష్‌కుమార్, ఎస్బీ, డిసిఆర్బీ, సీపీఎస్ ఇన్స్పెక్టర్లు శివకుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీసీ లోహిత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
- జాతీయ ఓటరు దినోత్సవాన్ని బుధవారం గద్వాల మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రవీంద్ర, ఎంపీవో చెన్నయ్య, ఏపీవో శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని వడ్డేపల్లి మునిసిపాలిటీ కేంద్రంలో బుధవారం శాంతినగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మునిసిపల్ చైర్పర్సన్ కరుణసూరి, తహసీల్దార్ జయరాములు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్పర్సన్ సుజాత రామకృష్ణారెడ్డి, ఎంఈవో నరసింహ, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఓటు హక్కు మన జన్మ హక్కు
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉండవల్లిలో ఎంపీపీ బీసమ్మ, తహసీల్దార్ వీరభద్రప్ప జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బీసమ్మ, తహసీల్దార్ వీరభద్రప్ప మాట్లాడుతూ ఓటు హక్కు మన జన్మ హక్కు అన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి, ఎంఈవో శివప్రసాద్, ఎస్ఐ బాలరాజు, వైస్ ఎంపీపీ దేవన్న, సర్పంచు రేఖ, ఎంపీటీసీ సభ్యులు రాజశేఖర్, సుంకన్న, కోఆప్షన్ మెంబరు చిన్న బాషుమియ్య, ఉప సర్పంచు సయ్యద్ రహమత్ హుస్సేన్, వెంకట్ గౌడు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మల్దకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్‌లింగం, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఓటుహక్కును వినియోగించుకోవాలి
భారత రాజ్యాగం మనకు ఇచ్చిన ఓటు హక్కును ప్రతీ పౌరుడు వినియోగించుకోవాలని రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు యొక్క విలువను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఇది ఒక ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో డీటీ వెంకటరమణ, ఆర్ఐ శ్రీనివాసులు, సికిందర్, వీఆర్ఏలు బజారి, మహేంద్ర పాల్గొన్నారు.
- ఓటరు దినోత్సవం సందర్భంగా బుధవారం అలం పూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద తహసీల్దార్ సుభాష్‌నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో అశోక్ కుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి
ప్రతీ ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలని కేటీదొడ్డి తహసీల్దార్ సుందర్రాజు గ్రామస్థులకు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహ్మద్ అజార్మొహియొద్దీన్, ఎంపీవో సయ్యద్‌ఖాన్, ఎస్ఐ వెంకటేష్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హనుమంతు పాల్గొన్నారు.