సీసీ ఫుటేజీ ద్వారా దొరికిన దొంగలు

ABN , First Publish Date - 2023-02-01T23:23:38+05:30 IST

కారులో ఎక్కిన ప్రయాణికుడిని చితకబాది నగదు, సెల్‌ఫోన్‌ అపహరించుకొని పారిపోయిన గుర్తు తెలియని దొంగలను పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకొన్నారు.

సీసీ ఫుటేజీ ద్వారా దొరికిన దొంగలు
విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ నరసింహ

- భూత్పూర్‌ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు రివార్డు ప్రకటించిన ఎస్పీ

- దొంగలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

భూత్పూర్‌, ఫిబ్రవరి 1 : కారులో ఎక్కిన ప్రయాణికుడిని చితకబాది నగదు, సెల్‌ఫోన్‌ అపహరించుకొని పారిపోయిన గుర్తు తెలియని దొంగలను పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకొన్నారు. నిందితులు వాడిన కారును సీజ్‌ చేసి, నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం సీఐ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. మండలం లోని కొత్తమొల్గర గ్రామానికి చెందిన కామాజిపురం రాజమల్లేష్‌ అనే వ్యక్తికి చెందిన గొర్రె మంద భూపాలపల్లి జిల్లాలో మేత కోసం వెళ్లింది. ఈయన కూడా మంద దగ్గరకి పోవడానికి జనవరి 27వ రాత్రి 10-30 గంటల సమయంలో భూపాలపల్లి వెళ్లేందుకు భూత్పూర్‌ చౌరస్తాకు వచ్చాడు. అప్పటికే చౌరస్తా దగ్గర హైదరాబాద్‌ వెళ్లడానికి ఆపుకొని ఉన్న కారులో మల్లేష్‌ ఎక్కాడు. భూత్పూర్‌ దాటగానే శేరిపల్లి శివారులో కారును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి నలుగురు యువకులు రాజమలేష్‌ను స్కూృ డ్రైవర్‌తో చంపేస్తామని బెదిరించి, మూగదెబ్బలు కొట్టి అతని వద్ద ఉన్న రూ.1500 నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. అదే రోజు రాత్రి రాజమల్లేష్‌ ఇంటికి వెళ్లి జరిగింది తన భార్య మంజులకు చెప్పి మరుసటి రోజు భూపాలపల్లికి వెళ్లిపోయాడు. భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి సీఐ రజితారెడ్డి సూచనల మేరకు చౌరస్తాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా కారు నంబరును కనుకొన్నారు. ఆ కారు యజమానిని పోలీసులు విచారించగా మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన వీరేందర్‌ అను వ్యక్తి రూ.2000 అద్దెకు మాట్లాడుకొని తీసుకెళ్లినట్లు తెలిసిందన్నారు. వీరేందర్‌తో పాటు రవి కాంత్‌, సంతోష్‌, జైపాల్‌ మొత్తం నలుగురు కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా విచార ణలో తేలినట్లుగా ఎస్పీ వెల్లడించారు. నగదు, కారు, సెల్‌ఫోన్‌ను సీజ్‌చేసి నిందితులను రి మాండుకు పంపించారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డిని, పోలీస్‌ కాని స్టేబుల్‌ నవీన్‌, వెంకటేష్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సీఐ రజితారెడ్డిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మహేష్‌, సీఐ రజితారెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

పేలుడు పదార్థాల కేసులో ఇద్దరి అరెస్ట్‌ : ఎస్పీ

జడ్చర్ల, ఫిబ్రవరి 1 : జడ్చర్ల మునిసిపాలిటి పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో అనుపమ తులు లేకుండా పట్టుబడ్డ పేలుడు పదార్థాలు విక్రయం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ నర్సింహులు వెల్లడించారు. బుధవా రం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో ఓ పూరిగుడిసెను కేంద్రంగా చేసుకొని 2075 డిటోనేటర్స్‌, 2774 జిలెటిన్‌ స్టిక్స్‌ సుమారు 5, 6 లక్షల విలువ చేసే పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వచేసి ఉంచగా విశ్వసనీయ సమాచారం మేరకు జడ్చర్ల పోలీసులు, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది సంయుక్తంగా పటిష్ట నిఘాతో సోదాలు చేయగా పట్టుబడాయని ఆయన తెలిపారు. పెబ్బేరుకు చెందిన మిద్దెరాజేశ్‌ అనే వ్యక్తికి కంప్రెషర్‌లు ఉండేవి. రాజేష్‌, సోమయ్యలకు మల్లేష్‌ సహకరించినట్లు తెలిపారు. వీరిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మూఠా సభ్యుల్లో ఐదు మంది ఉండగా మిద్దేరాజేష్‌, సోమయ్యలను అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు మల్లె రమేష్‌, బాలయ్య, గణేష్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, లెనిన్‌, ఏఎస్సై లక్ష్మణ్‌, కానిస్టేబుల్‌ విష్ణు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహేష్‌కుమార్‌, సీఐ రమేష్‌బాబు, ఎస్సైలు ఉన్నారు.

Updated Date - 2023-02-01T23:23:39+05:30 IST