ప్రజల జీవితాల్లో ‘కంటి’ వెలుగు

ABN , First Publish Date - 2023-01-25T23:33:10+05:30 IST

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘కంటివెలుగు’ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. ధరూరు మండల పరిధిలోని మార్లబీడు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కంటివెలుగు’ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రజల జీవితాల్లో ‘కంటి’ వెలుగు
మార్లబీడులో వృద్ధ మహిళకు అద్దాలు పెడ్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- మార్లబీడు, వీరాపురంలలో శిబిరాలు ప్రారంభం

ధరూరు, జనవరి 25 : ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘కంటివెలుగు’ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. ధరూరు మండల పరిధిలోని మార్లబీడు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కంటివెలుగు’ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వృద్ధులకు ఎమ్మెల్యే స్వయంగా కళ్లద్దాలు అమర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా మంది పేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, కానీ ఆర్థిక స్థోమత లేక పరీక్షలు చేయించుకోలేక పోతున్నారన్నారు. వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ంస్థ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, ఎంపీపీ నజుమున్సీసా బేగం, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ్డ, వైస్‌ ఎంపీపీ సుద ర్శన్‌ రెడ్డి, సర్పంచ్‌ సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు డీఆర్‌ విజయ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు జాకీర్‌, శ్రీరాములు, శేషంపల్లి నర్సింహులు, రాఘవేంద్రరెడ్డి, ఆనంద్‌, విజయ్‌, హనుమంతు, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం

గద్వాల రూరల్‌ : కంటి వెలుగు కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వీరాపురంలో బుధవారం కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, ఎంపీడీవో రవీంద్ర, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ నారాయణ, నాయకులు రమేష్‌ నాయుడు, వెంకట్రాములు, చిన్నయ్య, సూర్వ, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా ఆలయ ప్రారంభోత్సవం

మల్దకల్‌ : మండలంలోని మద్దెలబండ గ్రామంలో జములమ్మ, పరశురామస్వామి ఆలయాలను బుధ వారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. విగ్రహ ప్రతిష్ఠ, తదితర విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ సరోజమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌గౌడ, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, వైస్‌ ఎంపీపీ వీరన్న, ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాదరావు, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు రమేష్‌నాయుడు, నారాయణ, కృష్ణారెడ్డి, నర్సింహులు, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:33:11+05:30 IST