సర్వాంగ సుందరంగా సర్కార్‌ బడులు

ABN , First Publish Date - 2023-02-01T23:31:50+05:30 IST

సర్కార్‌ బడులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి కేసీఅర్‌ లక్ష్యమని, అందుకే మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

సర్వాంగ సుందరంగా సర్కార్‌ బడులు
రాజశ్రీ గార్లపాడులో నిర్వహించిన పాఠశాల ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, వేదికపై కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే అబ్రహాం

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- ఆర్‌ గార్లపాడు, కాకుళారంలలో ‘మన ఊరు - మన బడి’ ప్రారంభం

- పాల్గొన్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

ఎర్రవల్లి చౌరస్తా/ గద్వాల రూరల్‌, ఫిబ్రవరి 1 : సర్కార్‌ బడులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి కేసీఅర్‌ లక్ష్యమని, అందుకే మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. ఇటిక్యాల మండలంలోని రాజశ్రీ గార్లపాడు, గద్వాల మండల పరిధిలోని కాకుళారం గ్రామాల్లో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ప్రాఽథమికోన్నత పాఠశాలలను బుధ వారం వారు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సరితతో పాటు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు కల్పించి, విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ జీవితంలోని గొప్ప అశయాలను నేరవేర్చుకోవాలని అకాంక్షించారు. కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ విద్యార్థులకు చక్కగా బోధించి, వారు ఉన్నతంగా ఎదిగేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈవో సిరాజుద్దీన్‌, పీఅర్‌ ఎస్‌ఈ శివకుమార్‌, డీఈ సలీం, సర్పంచ్‌ పద్మ, ఎంపీటీసీ సభ్యుడు మల్లేశ్‌, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో రాఘవ, ఎంఈవో రాజు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, పార్టీ మండల అఽధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కరేందర్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపా యాలు కల్పించి, నాణ్యమైన విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. గద్వాల మండల పరిధిలోని కాకు ళారంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతితో కలిసి ‘మన ఊరు - మన బడి’ ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపించాలని తల్లి దండ్రులకు సూచించారు. జిల్లాలో 161 పాఠశాలను ప్రభుత్వం మన ఊరు - మన బడి పథకం కింద గుర్తించి, టాయిలెట్లు, కిచెన్‌షెడ్లు, భోజనం హాళ్లు, ప్రహరీ, అదనపు గదులను నిర్మిస్తోందని తెలిపారు. పాఠశాలలను దేవాలయాలతో సమానంగా చూసుకో వాలని సూచించారు. సమావేశంలో వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌ గౌడ, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, సర్పంచు పావని నర్సింహలు, డీఈవో సిరాజుద్దీన్‌, ఎంఈవో సురేష్‌, ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:31:52+05:30 IST