సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:18:42+05:30 IST

ఉద్యోగులకు సమయపాలన ఎంతో అవసరమని కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు.

సమయపాలన పాటించాలి
పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 6 : ఉద్యోగులకు సమయపాలన ఎంతో అవసరమని కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌తో కలిసి కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేయా లని అధికారులను ఆదేశించారు. బీఎల్‌వోలు స్వీక రించిన ఓటర్లను వెంటనే వెబ్‌సైట్‌లో నమోదు చే యాలని, ప్రజావాణిలో ఫిర్యాదు దారుల సమస్యల ను విని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. అంతకుముందు కలెక్టరేట్‌లో యూటీఏ టీఎస్‌ క్యా లెండర్‌ను విడుదల చేసి మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు అంతకిత భావంలో కృషి చేయాలని సూచించారు. యూటీఏ టీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫజ్లుర్‌ రెహమాన్‌, రాష్ట్ర అధ్య క్షుడు ఖవాజా కుతుబుద్దీన్‌, డీఈవో లియాఖత్‌ అలీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా ఎ స్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు యూటీఏ టీఎస్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ యా కార్యక్రమాల్లో ఉర్దూ ఉపాధ్యాయ సంఘం మ హబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌, సలాం ఖాన్‌, అన్సారి బిన్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమూద్‌, మోహియుద్దిన్‌, ఖాజిన్‌, మహమ్మద్‌, ఉస్మాన్‌ పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను సోమవారం కలెక్టర్‌ శ్రీహర్ష మండ లంలోని భైరంకొండ, పేరపళ్ల, నారాయణపేట గ్రౌండ్‌ స్కూల్‌, సింగార్‌బేస్‌ పాఠశాలలను పరిశీలిం చారు. పనులు పూర్తైన వాటిలో గ్రీన్‌ బోర్డు, బేం చీలను అందించాలని, మిగిలిన పనులను వేగంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పుర కమిషనర్‌ సునీత, విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్‌

నారాయణపేట : పాట్నాలో ఈనెల 10నుంచి జరిగే 18వ జాతీయ ఇంటర్‌ డిస్ట్రిక్‌ జూనియర్‌ అథ్లె టిక్స్‌ మీట్‌ 2023కు జిల్లా తరపున క్రీడాకారులు ఎంపిక కాగా సోమవారం కలెక్టర్‌ శ్రీహర్ష అభినం దించి జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. జి ల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్య దర్శి రమణ, రాకేష్‌, మధు, రమేష్‌, సిద్ధిక్‌, లక్ష్మి పాల్గ్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:18:44+05:30 IST