జంతు పోషణతో జీవితానికి సార్థకత

ABN , First Publish Date - 2023-01-24T23:40:04+05:30 IST

భూగోళంపై ఉన్న జీవరాశులు, వృక్ష సంపదను ప్రేమతో కాపాడితే మానవ జీవితానికి సార్థకత లభిస్తుం దని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు.

 జంతు పోషణతో జీవితానికి సార్థకత
జిల్లా కేంద్రంలో ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా ఎస్పీ మనోహర్‌

- అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

- జిల్లా కేంద్రంలో జంతు సంక్షేమ పక్షోత్సవ ర్యాలీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి24: భూగోళంపై ఉన్న జీవరాశులు, వృక్ష సంపదను ప్రేమతో కాపాడితే మానవ జీవితానికి సార్థకత లభిస్తుం దని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మంగళవారం జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా జంతు సంక్షేమ సంస్థ, జిల్లా పశు వైద్య సంవర్థకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన అవగాహన ర్యాలీని ఎస్పీ మనోహర్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడు తూ మాట్లాడుతూ ప్రకృతిలో జంతు జాలాలను కాపాడే బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందన్నారు. విద్యార్థులు పాఠశాల దశలోనే జంతువులపై ప్రేమ స్వభావం అలవర్చుకుంటే భావితరాలకు దిక్సూచిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రామేశ్వర్‌, జిల్లా పశు సం వర్థకశాఖ అధికారి జీవీ రమేష్‌, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి రమాదేవి, జిల్లా వెటర్నరీ అధికారి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాష్‌, డీఈవో గోవిందరాజులు, కృష్ణారెడ్డి, జీహెచ్‌ఎం కృష్ణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:40:04+05:30 IST