ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేద్దాం

ABN , First Publish Date - 2023-02-06T23:19:45+05:30 IST

ప్రజా వ్యతిరేక విఽ దానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ను అంతం చేద్దామని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేద్దాం
పేటలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతున్న కాంగ్రెస్‌ నాయకులు

నారాయణపేట, ఫిబ్రవరి 6 : ప్రజా వ్యతిరేక విఽ దానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ను అంతం చేద్దామని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని సింగార్‌బేస్‌, హాజీ ఖాన్‌ పేట, సివిల్‌ లైన్‌లో హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేపట్టి ఇంటింటికీ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వైఫల్యాలను ఎండగడుతూ కర పత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర స్ఫూర్తితో రెండు నెలల పాటు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేపట్ట డడం జరుగుతుందని, కేంద్రంలో తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశం నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అని దేశ ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక కార్పొరేట్‌ కంపెనీకా సాథ్‌ ఖుద్‌కా వికాస్‌తో కేంద్రం ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని కేసీఆర్‌ ఫ్రభుత్వం మోస పూరిత వాగ్ధానాలతో రైతులు, నిరుద్యోగులు, దళితు లను నిట్టనిలువున ముంచుతుందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నాయకులు నల్ల జెం డాలతో ఎస్‌బీఐ ముందు నిరసన వ్యక్తం చేసి, ప్ర ధాని మోదీ బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల ను పెట్టుబడుల రూపంలో కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టారని ఆరోపించారు. ప్రజల డబ్బు తిరిగి వచ్చేలా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందో ళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులు ఎండీ గౌస్‌, శివ కుమార్‌, నర హరి, సలీం, లిఖి రఘు, బోయ శరణప్ప, బోయ రమేష్‌, శ్రీనివాస్‌, సందీప్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

- కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని మద్దూర్‌ జడ్పీటీసీ స భ్యుడు రఘుపతిరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి సంజీవ్‌, మండలాధ్యక్షుడు నర్సిములు విర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సో మవారం మద్దూర్‌లోని ఎస్సీకాలనీలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను చేపట్టి, కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్‌ఎస్‌, బీజీపీ అవలంభిస్తున్న ప్ర జా వ్యతిరేక విధానాలను ప్రజలకు విరించారు. కాం గ్రెస్‌ నాయకులు మల్లికార్జున్‌, పాపయ్యగౌడ్‌, సుభా ష్‌, రహీం, చంద్రమోహన్‌, బాబు, కిష్టయ్యగౌడ్‌, షరీఫ్‌, నర్పిములు, మహిముద్‌ పాల్గొన్నారు.

- మక్తల్‌ మండలం లింగంపల్లిలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ్జకార్యక్రమంలో నర్సింహులు, రవికుమార్‌, గోవర్దన్‌, రాజేందర్‌నాయుడు పాల్గొన్నారు.

- మాగనూరు మండలం కొత్తపల్లిలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిములు కాంగ్రెస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవే ర్చడంలో విఫలం అయ్యారన్నారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచు ఆనంద్‌గౌడ్‌, కొత్తపల్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మప్ప, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నర్సింగప్ప, బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆనందు, రాజు, అంజప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:19:48+05:30 IST