కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడదాం

ABN , First Publish Date - 2023-02-06T23:54:39+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్ఘమైన వైఖరిని అవలంభిస్తు న్నాయని, ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఆ ప్రభుత్వాల తీరును ఎండగడదామని డీసీసీ అధ్యక్షులు జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడదాం
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులు

- హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో జీఎంఆర్‌, కాంగ్రెస్‌ నాయకులు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్ఘమైన వైఖరిని అవలంభిస్తు న్నాయని, ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఆ ప్రభుత్వాల తీరును ఎండగడదామని డీసీసీ అధ్యక్షులు జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరులో సోమవారం హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టేషన్‌ రోడ్‌లో వ్యాపార సముదాయాల వద్దకు వెళ్ళిన కాంగ్రెస్‌ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. దేశ సమగ్రతను కాపా డేది కాంగ్రెస్‌ పార్టీనే అని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, కార్పొరేట్‌ శక్తులకు దాసోహం అయ్యాయని దు య్యబట్టారు. మంగళవారం నుంచి గడపగడపకు హాత్‌ సే హాత్‌ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకు వెళ్తామన్నారు. ప్రతీ కాంగ్రెస్‌ నాయకుడు, కార్య కర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్‌, ఒబేదుల్లా కొత్వాల్‌, టీపీసీసీ ప్రధాన కార్య దర్శులు వినోద్‌కుమార్‌, సంజీవ్‌ ముదిరాజ్‌, నాయకులు వసంత, చంద్రకుమార్‌గౌడ్‌, సీజే బెన హర్‌, లక్ష్మణ్‌నాయక్‌, సాయిబాబ, సిరాజ్‌ఖాద్రి, బెక్కరి అనిత, రాఘవేందర్‌రాజు, అవేజ్‌, రాము లు యాదవ్‌ పాల్గొన్నారు.

అదానీ లావాదేవీలపై విచారణ జరపాలి

అదానీ కంపెనీల అక్రమ లావాదేవీలు, అక్ర మాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచా రణ జరిపించాలని డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూ దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అదానీపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నిర్వహించిన దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సోమవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శ్రేణులు ప్లకార్డులతో పార్టీ కార్యాలయం నుంచి ఎల్‌ఐసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ 2002లో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమం త్రిగా పనిచేసిన కాలంలో ఆదానీ గుజరాత్‌లో వ్యాపారం ప్రారంభించారన్నారు. అప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి రూ.50 వేల కోట్లు ఉంటే, 2014లో మోదీ ప్రధాన మంత్రి అయ్యాక అదానీ దేశ వ్యప్తంగా వ్యాపారులు ప్రారంభించి రూ.10.50 లక్షల కోట్ల వ్యాపారానికి ఎదిగారని విమర్శించా రు. అదానీ కంపెనీలలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలతో పెట్టుబడులు పెట్టించి దేశ ఆర్థిక వ్యవస్థను కొల్ల గొట్టారన్నారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, ఎర్రశేఖర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్‌, సంజీవ్‌ ముదిరాజ్‌, నాయకులు వసంత, చంద్రకుమార్‌గౌడ్‌, సీజే బెనహర్‌, లక్ష్మణ్‌నాయక్‌, సాయిబాబ, సిరాజ్‌ఖాద్రి, బెక్కరి అనిత, రాఘవేందర్‌రాజు, అవేజ్‌, రాములు యాదవ్‌, బ్రహ్మయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, నాగరాజు, అజిత్‌అలీ పాల్గొన్నారు. Z

Updated Date - 2023-02-06T23:55:59+05:30 IST