కమనీయం రథోత్సవం
ABN , First Publish Date - 2023-01-24T23:10:27+05:30 IST
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ అభయాంజనేయ స్వామి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల, కల్వకుర్తి ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, గుర్క జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి, ఎంపీపీ బక్కరాధ, స్థానిక సర్పంచ్ అనిత, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, ఆలయం పునరుద్ధరణ కమిటీ సభ్యులు కొబ్బరికాయాలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు.

ఘనంగా ఊర్కొండ అంజన్న తేరు
అధిక సంఖ్యలో తరలొచ్చిన భక్తులు
ప్రారంభించిన ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైపాల్‌యాదవ్
ఊర్కొండ, జనవరి 24: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ అభయాంజనేయ స్వామి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల, కల్వకుర్తి ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, గుర్క జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి, ఎంపీపీ బక్కరాధ, స్థానిక సర్పంచ్ అనిత, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, ఆలయం పునరుద్ధరణ కమిటీ సభ్యులు కొబ్బరికాయాలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ప్రకాశం, గుంటూరు, కర్నూల్ జిల్లాలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అంజన్న నామస్మరణతో మారుమోగాయి. ముందుగా స్వామి వారికి పంచ సూక్తములతో పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య తీసుకొచ్చి పూలతో అలకరించిన రథంలో ఉంచారు. అనంతరం రథాన్ని లాగారు. ఈ సందర్భంగా కల్వకుర్తి సీఐ ఆవుల సైదులు, ఊర్కొండ ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు భక్తులకు వసతులు కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తి మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, నాయకులు గోళి శ్రీనివాస్‌రెడ్డి, నాగోజీ, పాండు యాదవ్, గిరి నాయక్, జంగయ్య, రమేష్, రవీందర్, శ్రీనివాసులు, ప్రభాకర్, కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, అమరేశ్వర్‌రెడ్డి, అర్చకులు దత్తాత్రేయశర్మ, శ్రీనివాసశర్మ, ప్రవీణ్‌శర్మ, మహేష్‌శర్మ, అధికారులు పాల్గొన్నారు.