మెట్టినింటికి జములమ్మ

ABN , First Publish Date - 2023-02-01T23:08:22+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా జములమ్మ తల్లి బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చేరింది. అమ్మవారిని తీసుకరావడానికి సారెతో ఎద్దుల బండి మంగళ వారం వెళ్లింది.

మెట్టినింటికి జములమ్మ
ఎద్దుల బండిలో మెట్టినింటికి వస్తున్న జములమ్మ అమ్మవారు

గద్వాల రూరల్‌, ఫిబ్రవరి 1: జోగుళాంబ గద్వాల జిల్లా జములమ్మ తల్లి బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చేరింది. అమ్మవారిని తీసుకరావడానికి సారెతో ఎద్దుల బండి మంగళ వారం వెళ్లింది. సాయంత్రానికి గుర్రంగడ్డకు చేరుకున్న తర్వాత అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి అవుతుండగానే జముల మ్మను కృష్ణానదిలో అరిగిలి ద్వారా బయటికి తెచ్చారు. అక్కడ ఎద్దుల బండిపై కూర్చోబెట్టి బాజాభజంత్రీలతో బీరోలు, లత్తిపురం, వెంకటో నిపల్లిల మీదుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఊరూరా అమ్మవారికి హారతులు పట్టి, పూజలు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు జమ్మిచేడుకు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే సతీ మణి బండ్ల జ్యోతి ఆహ్వానం పలికి, పూజలు చేశారు. అక్కడి నుంచి ఆలయం వరకు దాదాపు నాలుగు గంటల పాటు ఊరేగింపు నిర్వహించారు.

ఆటక్టుకున్న పూణె కళాకారుల ప్రదర్శన

అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ చేసిన మహారాష్ట్ర పూణెకు చెందిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. 100 మంది కళాకారులు డోలు వాయిద్యాలు, పుట్టబొమ్మలు, శివసత్తులు, పోతు రాజుల వేశధారణలో ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలను తిలకించేందుకు భక్తులు, గ్రామస్థు లు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయానికి చేరిన తర్వాత ఆలయ చైర్మన్‌ సతీష్‌కుమార్‌, ఈవో కవితలు ఎద్దుల బండికి ఆహ్వానం పలికి, అమ్మవారిని ఆలయంలోకి చేర్చారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు అభిలాష్‌, మాఽధవి కాంమ్లే, జానకిరాములు, శంకర్‌ ఉన్నారు.

పోలీసుల లాఠీచార్జి

అమ్మవారి ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దాంతో పోలీసులు లాఠీచార్జి చేసి, అదుపులోకి తెచ్చారు. అమ్మవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు జమ్మిచేడు గ్రామం లోకి చేరారు. అక్కడ ఓ సామాజికవర్గం వారు కొంతదూరం వరకు భాజాభ జంత్రీలు, డీజేలను ఆపి, ముందుకు వెళ్లాలని సూచిం చారు. దీనికి నిర్వాహ కులు, భక్తులు ఒప్పుకోలేదు. మాటమాట పెరిగి ఘర్షణకు దిగారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. స్జేజీ మీదికి వచ్చిన తర్వాత మరోసారి ఘర్షణ పడ్డారు. పరిస్థితి చేయిదాటి పోతుం డటంతో పోలీసులు లాఠీచార్జీ చేసి, పరిస్థితిని చక్కదిద్దారు. అమ్మవారిని తేవడంలో తనకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై కోపంతో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఘర్షణను ప్రోత్సహించినట్లు ఆరోప ణలు వస్తున్నాయి.

Updated Date - 2023-02-01T23:08:23+05:30 IST