కలవర పెట్టిన శునక ప్రేమ

ABN , First Publish Date - 2023-01-24T23:31:07+05:30 IST

పిల్లలకు ఏదైనా అపాయం జరిగితే తల్లి విలవిలలాడి పోతుంది. మరి అలాంటి పిల్ల చనిపోతే ఆ తల్లి పడే బాధ వర్ణనా తీతం.

కలవర పెట్టిన శునక ప్రేమ
కుక్కపిల్ల చుట్టూ తిరుగుతున్న తల్లి కుక్క

- రోడ్డు ప్రమాదంలో కుక్కపిల్ల మృతి

- రోదిస్తూ తల్లి కుక్క నిరీక్షణ

నవాబ్‌పేట, జనవరి 24 : పిల్లలకు ఏదైనా అపాయం జరిగితే తల్లి విలవిలలాడి పోతుంది. మరి అలాంటి పిల్ల చనిపోతే ఆ తల్లి పడే బాధ వర్ణనా తీతం. మనుషుల్లోనే కాదు.. మూగజీవాల్లో కూడా ఈ ప్రేమ ఇంకా ఉందనే హృదయవిషాదకర ఘటన ఒకటి మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కన్పించింది. జిల్లా కేంద్రంలోని ఎర్రసత్యం చౌరస్తాలో రోడ్డు దాటుతున్న చిన్న కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో అది అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన తల్లి కుక్క అక్కడికి పరుగెత్తుకొచ్చి తన పిల్ల చావుకు కారణం తెలియక కంటతడి పెడుతూ అక్కడే దానిచుట్టు రోదిస్తు వచ్చిపోయే వాహనదారులపై దాడికి యత్నిస్తు తన తల్లి ప్రేమను చాటుకుంది. కుక్క అరుపులు విన్న స్థానికులు చూసి పలువురు విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-24T23:31:07+05:30 IST