పంటలు ఎండుతున్నాయ్‌

ABN , First Publish Date - 2023-02-06T23:41:47+05:30 IST

నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు పుష్కలంగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బోరుబావుల కింద 40వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు.

పంటలు ఎండుతున్నాయ్‌
నీరు లేక తడి ఆరిపోయిన వరి మడి

- వేసవికి ముందే ప్రారంభమైన కరెంట్‌ కోతలు

- 24 గంటల విద్యుత్‌ సరఫరా ఏమైందంటున్న ప్రజలు

- పట్టించుకోని అధికారులు - పరేషాన్‌లో అన్నదాతలు

ఆత్మకూర్‌, ఫిబ్రవరి 6: నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు పుష్కలంగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బోరుబావుల కింద 40వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా యాసంగి సీజన్‌లో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వరి పంటతో పాటు చెరుకు పంటలను సాగు చేస్తున్నారు. ఎండలు ముదరక ముందే విద్యుత్‌ అధికారులు కోతలు ప్రారంభించ డంతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12 గంటలు కూడా ఇవ్వడం లేదు..

ఆత్మకూర్‌ మండలంలో జూరాల ప్రాజెక్టు ఉన్నం దున చెరువులు, కుంటలు కళకలలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగిన కారణంగా వరిని ప్రధాన పంటగా సాగుచేస్తున్నారు. జనవరి చివరి మాసం నుంచే కరెంట్‌ కోతలు ప్రారంభం కావడంతో పంట లు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా కాదుకదా కనీసం 12 గంటలు కూడా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్‌ అధికారులను ఆరా తీయగా జిల్లా అధికారుల ఆదే శాల మేరకే కోతలు విధిస్తున్నామని విద్యుత్‌ అధికా రులు అంటున్నారు రైతులు వాపోతున్నారు. మండ లంలో 14 గ్రామాలు ఉండగా 20 వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. అందుకు గాను రెండు సబ్‌ స్టేషన్‌లు మాత్రమే ఉండడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. బాలకృష్ణాపూర్‌, జూరాల గ్రామంలో మరో రెండు సబ్‌స్టేషన్లు పూర్తయితే కష్టాలు తీరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-06T23:41:56+05:30 IST