మెడికల్‌ ఏజెన్సీలపై దాడులు

ABN , First Publish Date - 2023-02-06T23:33:33+05:30 IST

మెడికల్‌ ఏజెన్సీలు రశీదులు లేకుండా ఆర్‌ఎంపీలకు ఔషధాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అసిస్టెంట్‌ డైరక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు.

మెడికల్‌ ఏజెన్సీలపై దాడులు

గద్వాల క్రైం, ఫిబ్రవరి 6: మెడికల్‌ ఏజెన్సీలు రశీదులు లేకుండా ఆర్‌ఎంపీలకు ఔషధాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అసిస్టెంట్‌ డైరక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ఈనెల ఒకటి ‘పైసలిస్తే మెడికల్‌ ఏజెన్సీ’ అన్న శీర్షికన ఆర్‌ఎంపీలకు అధిక మోతాదులో యాంటిబయాటిక్స్‌ సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దినేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పలు మెడికల్‌ ఏజెన్సీలు, మెడికల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు దాడుల్లో గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులు మహ్మద్‌ రఫీ, రబియా, రష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:33:34+05:30 IST