v

ABN , First Publish Date - 2023-02-01T23:22:02+05:30 IST

తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం లో కురుకోపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు.

v
జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న చింతల రామచంద్రారెడ్డి

ప్రజలను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి

భూత్పూర్‌, పిబ్రవరి 1 : తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం లో కురుకోపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. బుధవారం భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివారులో ఓ ఫంక్షన్‌ హాల్లో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమాశాన్ని జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి పీ. చంద్రశేఖర్‌, రాష్ట్ర ఉపా ధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డి, పాలమూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సుదర్శన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ 9 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లా వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో అప్పుల పాలై 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు కనీసం వడ్డ్డీకూడా మాఫీ చేయలేకపోయారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1200 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఇంత వరకు ఎందుకు భర్తీ చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమా నికి హాజరై మాజీ మంత్రి పీ. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రం పంపించే నిధులతోనే బస్తీ దవాఖాన, ఆశ వర్కర్లకు జీతాలు, డబుల్‌ బెడ్‌రూము ఇళ్లు, మిషన్‌ భగీరథ నీరు, చాలా ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చి మేమే చేస్తు న్నామని గొప్పలు చెప్పుకోవడం చాలా దారుణమని అన్నారు. ఈ సమావేశం లో బీజేపీ నాయకులు ఎగ్గని నర్సిములు, పద్మజారెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యక్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:22:04+05:30 IST