వేరుశనగ మిషన్‌లో పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2023-01-25T23:20:10+05:30 IST

వేరుశనగ మిషన్‌(రోటవేటర్‌)లో పడి మహిళ మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల పరిధిలోని జనుంపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

వేరుశనగ  మిషన్‌లో పడి మహిళ మృతి
గంగమ్మ(ఫైల్‌)

కోడేరు, జనవరి 25 : వేరుశనగ మిషన్‌(రోటవేటర్‌)లో పడి మహిళ మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల పరిధిలోని జనుంపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తీగలపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఆకునమోని గంగమ్మ(45) బుధవారం ఉదయం వేరుశనగ (బుడ్డలు) పట్టేందుకు అదే గ్రామానికి చెందిన కుర్వ సాంబశివుడు ట్రాక్టర్‌కు కూలీగా వెళ్లింది. జనుంపల్లి శివారులో అదే గ్రామానికి చెందిన గొల్లకొట్టె మద్దిలేటి పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు తలకు చుట్టుకున్న టవల్‌ మిషన్‌లో పడి తల ఎగిరిపడి తల ఒక వైపు, మొండెం మరో వైపు పడ్డాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల్లి కృష్ణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, కుమారుడు పరుశరాములు ఉన్నారు.

Updated Date - 2023-01-25T23:20:10+05:30 IST