మీ తరువాత అభివృద్ధి లేదు..

ABN , First Publish Date - 2023-01-25T23:18:25+05:30 IST

శాశ్వత అభివృద్ధి చేస్తే ప్రజల మనుషుల్లో ఎప్పుడు శాశ్వతంగా కనిపిస్తాము, ప్రతి అభివృద్ధి ద్వార వచ్చిన ఫలితం దానిని చూసిస్తుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

మీ తరువాత అభివృద్ధి లేదు..
తుమ్మలతో మాట్లాడుతున్న ప్రజలు

అశ్వారావుపేట, జనవరి 25: శాశ్వత అభివృద్ధి చేస్తే ప్రజల మనుషుల్లో ఎప్పుడు శాశ్వతంగా కనిపిస్తాము, ప్రతి అభివృద్ధి ద్వార వచ్చిన ఫలితం దానిని చూసిస్తుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు అప్పుడప్పుడు తప్పుదోవ పట్టి తప్పులు చేయడం వల్ల కొంత మేర నష్టం జరుగుతుందని, మున్ముందైన తప్పుదోవను అనుసరించవద్దని తుమ్మల హితవు పలికారు. బుధవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేటలోని కాకి నరసింహారావు మేనల్లుడిని ఆశీర్వదించారు. అనంతరం చిలకలగండి ముత్యాలమ్మఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసారు. జుజ్జూరు రాంబాబు మనవరాలికి ఆశీర్వచనాలు అందజేసారు. అనంతరం ఆయనను పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు కలిసారు. మీ హయాంలోనే ఈ ప్రాంతం ఎనలేని అభివృద్ధి జరిగిందని, ఆ తరువాత మీరు చేసిన రహదారులని రిపేరు చేసే పరిస్థితి లేదని, అన్ని గోతులమయంగా మారిపోయాయని, సమస్యలను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే మీకు పదవి రావాలని, మా ప్రాంతం అభివృద్ధి జరగాలని కాంక్షిస్తున్నట్టు చెప్పారు. దీనికి స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడైన శాశ్వత అభివృద్దే ప్రజలలో నిలబడి పోతుందని అన్నారు. ఆ సమయంలో అక్కడకి వచ్చిన గిరిజన మహిళలతో కోయ బాషలో మాట్లాడారు.

Updated Date - 2023-01-25T23:18:25+05:30 IST