‘స్వయం సహాయక’ మహిళల ఇళ్లకు సౌరవిద్యుత

ABN , First Publish Date - 2023-01-25T23:31:51+05:30 IST

పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరెంట్‌ వినియోగం విపరీతంగా పెరడం, బిల్లులు భారీగా వస్తున్న సమయంలో సౌరవిద్యుతను విస్త్రత పరుస్తున్న ప్రభుత్వాలు.. ఈ కార్యక్రమంలోనూ మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ సంఘాల్లోని మహిళల ఇళ్లకు సౌరవిద్యుతను అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, టీఎస్‌ రెడ్‌కో ద్వారా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

‘స్వయం సహాయక’ మహిళల ఇళ్లకు సౌరవిద్యుత

తొలివిడతలో ఉమ్మడి జిల్లాలోని 17మండలాలు, మూడు మెప్మా కేంద్రాలు గుర్తింపు

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 25 : పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరెంట్‌ వినియోగం విపరీతంగా పెరడం, బిల్లులు భారీగా వస్తున్న సమయంలో సౌరవిద్యుతను విస్త్రత పరుస్తున్న ప్రభుత్వాలు.. ఈ కార్యక్రమంలోనూ మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ సంఘాల్లోని మహిళల ఇళ్లకు సౌరవిద్యుతను అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, టీఎస్‌ రెడ్‌కో ద్వారా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఈ సౌరవిద్యుత విస్తరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో 17 మండలాలతో పాటు మూడు పట్టణాలను ప్రభుత్వం గుర్తించింది. ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, ఆశ్వరావుపేట, భద్రాచలం, దుమ్ముగూడెం, గుండాల, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, పినపాక, సుజాతనగర్‌, చింతకాని, ఖమ్మంరూరల్‌, కొణిజర్ల, ముదిగొండ, సత్తుపల్లిరూరల్‌, ఎర్రుపాలెం మండలాలను గుర్తించారు. పట్టణాల పరిధిలో మెప్మా మహిళా స్వయం సంఘాలకు అవకాశమిచ్చారు. సత్తుపల్లిలోని ప్రియదర్శిని, మధిరలో సరస్వతి, ఖమ్మంలో కస్తూరి మహిళా సంఘాలను గుర్తించారు. ఇక ఒక్కో మండలంలో 35మంది మహిళల ఇళ్లను గుర్తించి సౌరవిద్యుతను ఏర్పాటు చేయనున్నారు.

స్త్రీ నిధి ద్వారా రుణాలు..

2కిలో వాట్స్‌ యూనిట్‌కు రూ.1,42,200, 3కిలోవాట్స్‌ యూనిట్‌కు రూ.1,92,360 ఖర్చవుతుంది. ప్రభుత్వం 2కిలోవాట్స్‌ యూనిట్‌కు రూ.39,200, 3కిలో వాట్స్‌కు రూ.57,360సబ్సిడీగా ఇస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్త్రీ నిధి ద్వారా 2కిలో వాట్స్‌కు రూ.లక్ష, 3కేవీకి రూ.1,25,000 సబ్సిడీలను అందించి తక్కువవాయిదా డబ్బులతో నెలవారీ వసూళ్లు చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమ విధివిధానాలపై మంగళవారం అధికారులు ఆదేశాలు అందడంతో బుధవారం ఖమ్మం కొత్త కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మెరుగు విద్యాచందన, టీఎస్‌రెడ్‌కో డీఎం ఉమాకాంత, స్త్రీ నిధి పర్యవేక్షకులు సమావేశమై ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు.

Updated Date - 2023-01-25T23:31:51+05:30 IST