మార్చి 22నుంచి నవమి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-02-07T01:00:29+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ ఐదు వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

మార్చి 22నుంచి నవమి బ్రహ్మోత్సవాలు

30న భద్రాద్రిలో సీతారాముల కల్యాణం

31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం

భద్రాచలం ఫిబ్రవరి 6: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ ఐదు వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా మార్చి 22నుంచి 31వరకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక ప్రయుక్త శ్రీ రామాయణ మహాక్రతువు నిర్వహించనున్నారు. మార్చి 22న శోభకృత్‌ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం, తిరువీధిసేవలు ప్రారంభమవుతాయి. అదేరోజు శ్రీ రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ చేస్తారు. మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం చేయనున్నారు. 27న ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడ దివాసం, 28న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుస్తానార్చనం, బేరిపూజ, దేవత ఆహ్వానం, బలిహరణం నిర్వహించనున్నారు. 29 ఎదుర్కోలు సేవ, 30న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభంకానుంది. 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ ఒకటిన సదస్యం, రెండున తెప్పోత్సవం, చోరోత్సవం మూడున ఊంజల్‌ ేసవ, నాలుగున వసంతోత్సవం, ఐదున చక్రతీర్థం, పూర్ణాహుతి, సార్వభౌమేసవ, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, ఆరాధనలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిత్యకల్యాణాలకు విరామం ఇవ్వనున్నారు. మార్చి 26నుంచి ఏప్రిల్‌ 11వరకు పవళింపు సేవలు నిర్వహించరు. ఏప్రిల్‌ 12న నూతనపర్యం కోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27న శ్రీరామ పునర్వసుదీక్ష విరమణ, 28న పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-02-07T01:00:30+05:30 IST