పల్లెల ముఖచిత్రాన్ని మారుస్తున్న సీఎం

ABN , First Publish Date - 2023-01-25T23:15:36+05:30 IST

పల్లెలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.

పల్లెల ముఖచిత్రాన్ని మారుస్తున్న సీఎం
రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రేగా

బూర్గంపాడు, జనవరి 25: పల్లెలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం అశ్వాపు రం మండల పరిధిలోని గొల్లగూడెం, సీతారాంపురం, మెండికుంట, నెల్లిపాకబంజర, మల్లెలమడుగు గ్రామాలలో నిర్మించిన సీసీ రోడ్లకు రేగా ప్రారంభోత్సవాలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల ముఖచిత్రాలను మారుస్తు పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో గ్రామాలు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

Updated Date - 2023-01-25T23:15:36+05:30 IST