10న ఖమ్మంలో కేటీఆర్‌ పర్యటన

ABN , First Publish Date - 2023-02-07T00:58:21+05:30 IST

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఈనెల 10న ఖమ్మంలో పర్యటించే అవకాశముందని, నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

10న ఖమ్మంలో కేటీఆర్‌ పర్యటన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

14వ తేదీలోపు ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు: మంత్రి అజయ్‌

ఖమ్మం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఈనెల 10న ఖమ్మంలో పర్యటించే అవకాశముందని, నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ కేటీఆర్‌ పర్యటన ఇంకా ఖరారుకాకపోయినా రూ.6.50కోట్లతో ఖమ్మంలో నిర్మించిన వెజ్‌, నానవెజ్‌ మార్కెట్‌, గోళ్లపాడు అధునాతన పార్కుల ప్రారంభం కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే గత నెల 18న సీఎం కేసీఆర్‌ ఖమ్మం సభలో జర్నలిస్టులకు నెలరోజుల్లో ఇళ్లస్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నామని, ఈనెల 10 నుంచి 14వతేదీలోపు ఖమ్మం జర్నలిస్టులకు మంత్రి హరీ్‌షరావు చేతులమీదుగా ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో జర్నలిస్టుకు 200గజాలు అందిస్తామని, సీఎం హామీని తక్షణం నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం కలెక్టర్‌తో సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణుఎస్‌ వారియర్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, కార్పొరేషన కమిషనర్‌ ఆదర్శసురభి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:58:22+05:30 IST